Minister Nara Lokesh Responded on Jagan Security : జెడ్ ప్లస్ భద్రత ఉన్నా.. ఇంకా జగన్ కు అభద్రత ఎందుకని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ కు 58 మంది భద్రతతో పాటు 2ఎస్కార్ట్ బృందాలు, 10మంది సాయుధ గార్డుల భద్రత ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. కాన్వాయ్‌లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బులెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయిని వెల్లడించారు. ఇవి సరిపోవు అన్నట్లు ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు.
'పరదాల మాటున తిరిగేవారికి 986 మంది సెక్యూరిటీ అవసరమా? - మనం ప్రజా సేవకులం మాత్రమే' - Jagan Security
ఈటీవీ లోగోతో ఫేక్ ప్రచారాలు :వైసీపీ సామాజిక మాధ్యమాల్లో ఈటీవీ లోగోతో నడుపుతున్న పలు ఫేక్ ప్రచారాలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో తన దోపిడీ ఆగిపోయిందని జగన్ తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఫేక్ జగన్ చేస్తున్న ఫేక్ ప్రాపగాండాకి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పొరుగు రాష్ట్రంలో రుణాల కోసం బ్యాంకు ఎదుట ఉన్న రైతులను ఏపీలో అంటూ తమకే సాధ్యమైన రీతిలోజగన్ గ్యాంగ్ ఫేక్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని తప్పుబట్టారు.
కిమ్ గురించి అనుకుంటే పొరపాటే! : అత్యాధునిక రక్షణ పరికరాలు, నివాసం చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడకంచె, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు.. మూడు షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది.. ఇదంతా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి అనుకుంటే పొరపాటే! మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న భద్రతకు సంబంధించిన లెక్కలివి. అయితే ఎన్నికల్లో ఓడిన జగన్ తాజాగా తన భద్రతను పునరుద్దరించాలని, జూన్ 3వ తేదీ నాటికి 900 మందితో ఉన్న భద్రతను పునరుద్దరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు.
సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదు :జగన్‌కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన నేపథ్యంలో.. నిబంధనల మేరకు జగన్‌కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీసు శాఖ వెల్లడించింది. అయితే, సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెల్చి చెప్పారు.
జగన్‌కు ఆ విషయం కూడా తెలియదా? : హోంమంత్రి అనిత - Home Minister on Jagan Security
జగన్ గన్మెన్లను అడుగుతున్నది భద్రత కోసమా, స్టేటస్ కోసమా?: తులసిరెడ్డి - tulasi reddy on ys jagan security