Minister Nara Lokesh Received Requests from People:అధిక వడ్డీ పేరుతో తీవ్ర వేదింపులకు గురి చేస్తున్నారని విజయవాడకు చెందిన ఓ బాధితుడు మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశాడు. అధిక వడ్డీ వసూలుతో తీవ్రంగా నష్టపోయాయని తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన జక్క వీరస్వామి మంత్రి లోకేశ్ వద్ద తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఓ మహిళ వద్ద 4 ఏళ్ల క్రితం రూ.2 లక్షల అప్పు తీసుకున్నానని కానీ దానికి అసలుగా రూ.7.50 లక్షలు వసూలు చేశారని, ఇంకా మరో రూ.4 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారని వీరస్వామి మంత్రి లోకేశ్‌కు వివరించారు.
'2 లక్షలకు 7.50 లక్షలు వసూలు చేశారు - మరో 4 లక్షలివ్వాలని వేధిస్తున్నారు' (ETV Bharat) భారీగా వచ్చిన బాధితులు: మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరి నుంచి విజ్ఞప్తులను స్వయంగా తీసుకున్న లోకేశ్ సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులు, పోలీసులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.
కడియపు లంక నర్సరీలోని ఈ మొక్కపై రతన్ టాటాకు ఆసక్తి - స్వయంగా కలిసిన రైతులు
అందుకున్న ఫిర్యాదులు:
- అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సీఎం సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన కె. మంగ విజ్ఞప్తి చేశారు.
- తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లిలోని సుందరయ్య నగర్‌కు చెందిన నాగేశ్వరమ్మ కోరారు.
- గత 9 దశాబ్దాలుగా గ్రామంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం మూసివేసిందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దానిని తిరిగి పునరుద్దరించాలని కోరుతూ ప్రకాశం జిల్లాలోని తూర్పు పెద్దివారిపాలెం, పడమర పెద్దివారిపాలెం గ్రామస్థులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
- తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన గాదె గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
- దివ్యాంగురాలినైన తనకు ఎలాంటి ఆధారం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా ఉల్లిపాలెంకు చెందిన జి.సుగుణ విన్నవించారు.
సమస్యలు తీరుస్తామని హామీ: ఫిర్యాదులు అన్నీ స్వీకరించిన మంత్రి నారా లోకేశ్ తమ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?
మద్యం దుకాణాల కేటాయింపులో సిండికేట్లకు సహకరిస్తే కఠిన చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర