ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం - విద్య, ఉపాధి కల్పనపై లోకేశ్ ప్రత్యేక దృష్టి

విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల అధికారులతో మంత్రి లోకేశ్‌ సమావేశం - రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఉద్ఘాటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2024, 9:37 AM IST

LOKESH_REVIEW_ON_ITI_EDUCATION
LOKESH_REVIEW_ON_ITI_EDUCATION (ETV Bharat)

Minister Nara Lokesh Meeting with Education Officials :రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్య పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లభించేలా పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో జెమ్స్‌ జ్యుయలరీ పార్కు ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రాన్ని విజ్ఞాన, సృజనాత్మక హబ్‌గా రూపుదిద్దేందుకు ఆగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు.

అధికారులతో మంత్రి లోకేశ్‌ సమావేశం :విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేశ్‌ తన శాఖలకు సంబంధించిన అధికారులతో ఉండవల్లిలోని నివాసంలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ చదివిన ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికారులకు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి విభాగం పని చేయాలని ఆదేశించారు.

జగన్‌ అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గరలో ఉంది : లోకేశ్

ప్రతి విద్యార్థికీ ఉద్యోగం : ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా అనంతపురంలో ఆటోమోటివ్‌, కడప, కర్నూలులో పునరుద్పాదక ఇంధనం, ప్రకాశంలో బయోఫ్యూయల్‌, గోదావరిలో ఆక్వా, పెట్రోకెమికల్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, రక్షణ రంగాలపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని మంత్రి లోకేశ్ అన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఐటీఐ , పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత రంగాల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. విదేశాల్లో బ్లూకాల్‌ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్‌ ఉందన్న లోకేశ్‌ ఒక్క జపాన్‌లోనే 50 వేల మంది బ్లూకాలర్‌, నర్సింగ్‌ ఉద్యోగులు కావాల్సి ఉందన్నారు.

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా :మంగళగిరిలో నిర్వహిస్తున్న నైపుణ్య గణనను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక్కడ గుర్తించిన లోపాలను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాలని సూచించారు. నైపుణ్య గణన డేటాను ఇన్ఫోసిస్‌ లాంటి ప్రఖ్యాత సంస్థలతో అనుసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కొత్తగా రాబోయే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డేటాను సిద్ధం చేయాలని లోకేశ్‌ నిర్దేశించారు. ప్రధాన కంపెనీల మానవ వనరుల విభాగంతో మాట్లాడి అవసరాలను గుర్తించాలని సూచించారు.

ఏపీ పెట్టుబడుల స్వర్గధామం - పెట్టుబడిదారులకు వాట్సప్​లో అప్​డేట్స్ : లోకేశ్

జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ : విశాఖలో 7 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి విభాగం అభివృద్ధి చేస్తున్న పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వ జాబ్‌ పోర్టల్‌తో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న జెమ్స్‌-జ్యుయలరీ సెంటర్‌ను అధ్యయనం చేశామని త్వరలోనే ఆ సంస్థ అధికారులను రాష్ట్రానికి ఆహ్వానించి వారి సూచనలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 ఆదర్శ కెరీర్‌ కేంద్రాలు మంజూరు కాగా ఇప్పటికే 12 ప్రారంభమయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.

కేంద్ర ప్రభుత్వ జాబ్‌ పోర్టల్‌తో అనుసంధానం :ప్రాజెక్టు ఆధారిత, పీర్‌ టూ పీర్‌ లెర్నింగ్‌ విధానాలను దేశమంతటా నెలకొల్పుతున్న అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ విడిగా సమావేశమయ్యారు. ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు సంకల్పించామని లోకేశ్‌ తెలిపారు. 1998లో కుప్పంలో 172 ఎకరాల్లో ఉన్న అగస్త్య సృజనాత్మక ల్యాబ్‌ను ఏర్పాటుచేసినట్లుగా రాష్ట్రంలో ప్రాంతీయ సైన్స్ సెంటర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నతంగా రాణించేలా వారిలో సామర్థ్యాల పెంపు, స్టెమ్‌ ల్యాబ్స్‌, మొబైల్‌ స్టెమ్‌ ల్యాబ్స్‌ను ఉపాధ్యాయులే పాఠశాలల వారీగా తక్కువ ఖర్చుతో ఏర్పాటుచేసుకోగలిగే విధానాలను మంత్రి లోకేశ్‌కు అగస్త్య ఫౌండేషన్‌ ప్రతినిధులు వివరించారు.

ప్రజ‌ల్ని హింసించిన జ‌గ‌నాసురుడి దుష్టపాల‌నను జ‌నమే అంత‌మొందించారు:చంద్రబాబు, లోకేశ్

ABOUT THE AUTHOR

...view details