Four IAS Officers Reported In Ap On The Orders Of DOPT : నలుగురు ఐఏఎస్ అధికారులు డీఓపీటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి అరుణ, వాణి ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌కు రిపోర్టు చేశారు. నిన్న(బుధవారం) సాయంత్రం తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో నలుగురు అధికారులు రాష్ట్రానికి వచ్చారు. మరో అధికారి ఎం. ప్రశాంతి కూడా నిన్ననే తెలంగాణలో రిలీవ్ అయ్యారు. అయితే ఆమె ఇంకా రిపోర్టు చెయ్యలేదు. ఏపీ క్యాడర్‌లో చేరినట్లుగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు కంప్లేయన్సు రిపోర్టు పంపారు.
ఇదీ వివాదం : ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్‌లను 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు రిలీజ్ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపీఎస్‌లు అంజనీ కుమార్, సంతోశ్ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఆంధ్రాకు కేటాయించారు. ఐఏఎస్ కేడర్‌కు చెందిన అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్ఎస్ రావత్, ఎల్. శివశంకర్, సి. హరి కిరణ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్‌ను తెలంగాణకు కేటాయించారు.
వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు-సేవ చేయాలని లేదా? - ఐఏఎస్‌లను ప్రశ్నించిన క్యాట్
విభజన తీరుపై అబ్జెక్షన్ చేస్తూ వీరందరూ 2014లో క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ తర్వాత రంగనాథ్, సంతోశ్ మెహ్రా తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై దర్యాప్తు జరిపిన క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
డీవోపీటీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో కూడా ఊరట దక్కలేదు. తెలంగాణలో పనిచేస్తున్న వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలిని ఏపీకి, అక్కడ పనిచేస్తున్న సృజన, శివశంకర్, హరికిరణ్ తెలంగాణకు వెళ్లాల్సిందేనని ఇటీవల కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, డీవోపీటీ ఆదేశించింది. డీవోపీటీ ఉత్తర్వులపై క్యాట్ స్టే ఇవ్వకపోవడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ ఆలిశెట్టి ధర్మాసనం విచారణ జరిపింది.
ఐఏఎస్‌లకు దక్కని ఊరట - పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు
'సొంత రాష్ట్రాలకు వెళ్లండి' - ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ సహా పలువురి అభ్యర్థనలు తోసిపుచ్చిన కేంద్రం