Prakash Raj OG Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఓజీ' (OG). ఈ సినిమాను డైరెక్టర్ సుజీత్ ముంబయి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. గతేడాది రిలీజైన గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
RFCలో షూటింగ్
పలు కారణాల వల్ల షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన పవన్, రీసెంట్గా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓజీ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో పవన్ పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నారని టాక్
ఇదే షెడ్యూల్ షూటింగ్లో ఆయన కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ప్రకాశ్ రాజ్ - పవన్ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అలాగే వీరిద్దరిపై ఓ ఫైట్ సీన్ సైతం షూట్ చేస్తారని తెలుస్తోంది. అయితే రీసెంట్గా జరిగిన పరిణామాల వల్ల వీరిద్దరి మధ్య షూటింగ్ హాట్ టాపిగ్గా మారింది. సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు.
ఇక 'ఓజీ' సినిమా విషయానికొస్తే, ముంబయి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. పవన్ సరసన నటి ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ రోల్లో కనిపించనున్నారు. వీరితో పాటు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సీనియర్ నటుడు వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ సినిమాల విషయానికొస్తే ఆయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్‌పై బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశంసలు - ఏం అన్నారంటే?
'OG స్టోరీ బాబాయ్ కంటే ముందు నేనే విన్నా - ఇది మీ ఊహకు అందదు' - Varun Tej on OG Movie