IMD Issues Cyclone and Rain Alert in Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రానున్న రెండురోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఈ ఆవర్తనం కొనసాతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రానున్న 36 గంటల్లో అల్పపీడనం - ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం - ఆ మూడు రోజులపాటు ఏపీలో పలు జిల్లాలకు వర్షసూచన
IMD Issues Cyclone and Rain Alert in Andhra Pradesh (ETV Bharat)
Published : Nov 9, 2024, 8:56 PM IST