Megastar Chiranjeevi Visits Tirumala : తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. 69వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజన దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తమ అభిమాన నటుడైన మెగాస్టార్ చిరంజీవిని చూసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. చిరంజీవితో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.
MLA Nandamuri Balakrishna Wife Vasundhara Visit Tirumala : తిరుమల శ్రీవారిని సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. ఇవాళ వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ (TTD) ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.