Medigadda Barrage Issue Updates :మేడిగడ్డ ఆనకట్ట వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర సర్కార్‌కు పంపింది. అక్టోబర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో (Medigadda Barrage) ఏడో బ్లాక్ కుంగిన విషయం తెలిసిందే. ఈ బ్లాకులో పియర్స్ దెబ్బతినడంతోపాటు దిగువన కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్ దెబ్బతినడం తదితర సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
Irrigation Department Committee on Medigadda :ఈ క్రమంలోనేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు బ్యారేజ్‌ను పరిశీలించి పలు చర్యలకు సిఫార్సు చేశారు. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న ఏబీ పాండ్యా బృందం కూడా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేశాయి. అయితే మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage Damage) కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా మారింది.
కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ
మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించడం :ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్, హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రామరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఓఅండ్‌ఎం) నాగేందర్‌రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) మురళీధర్ తదితరులతో కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సర్కార్ ఆమోదం తర్వాత కమిటీ బ్యారేజీ కుంగడానికి గల కారణాలపైఅధ్యయనం చేసి రెండు, మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది.