Medigadda Barrage Damage Issue : మేడిగడ్డ బ్యారేజీ సమస్య ప్రాథమిక అంచనాలకంటే ఇంకా తీవ్రంగా ఉందా? పియర్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయా.. అంటే అవుననే అంటున్నాయి దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు. ఏడో బ్లాక్‌లోనే కాకుండా అటూ ఇటూ ఉండే 6,8 బ్లాక్‌లలో కూడా మరిన్ని పియర్స్‌కు నష్టం వాటిల్లినచ్లు అంచనాలు వేస్తున్నాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్ వంద మీటర్లు దాటి కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Vigilance Inquiry On Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీకుంగిపోవడానికి, పియర్స్ భారీగా దెబ్బతినడానికి నాణ్యత, నిర్వహణ లోపాలతోపాటు అనేక వైఫల్యలాను కొత్తగా వెలుగు చూసినట్లు తెలిసింది. మొదట గుర్తించిన పియర్స్ మాత్రమే కాకుండా మరికొన్ని బీటలు వారినట్లు సమాచారం. ఇప్పటివరకు పియర్స్ బీటలు వారినట్లు మాత్రమే వెలుగులోకి రాగా, కొత్తగా విజిలెన్స్ దర్యాప్తులో భారీగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్య తీవ్రత అంచనా కంటే చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్న దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డిజైన్‌లో కూడా లోపాలు ఉన్నట్లు భావిస్తున్న వారు, లాగ్‌బుక్, కాంక్రీటు మిక్సింగ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు కూడా అన్నీ లేవని సంబంధిత ఇంజినీర్లు వారికి చెప్పినట్లు తెలిసింది.
ప్రాజెక్టు రికార్డులన్నీ స్వాధీనం :మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ వారు ప్రాజెక్టు సంబంధించిన రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 16,17 తేదీల్లో డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ఇంజినీర్లతో చర్చలు జరిపింది. డిజైన్లు మొదలుకొని అందుబాటులో ఉన్న రికార్డులన్నింటినీ విజిలెన్స్ అధికారులు వివరించారు. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ, కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ ఛీఫ్, మేడిగడ్డ డివిజన్‌కు సంబంధించిన ఇంజినీర్లు తదితరులతో అధికారులు మాట్లాడారు.
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల సోదాలు
Medigadda Barrage Issue Latest News :వీటన్నింటి తర్వాత బ్యారేజీ కుంగడం గత అక్టోబరులో అకస్మాత్తుగా జరిగింది కాదని, గత రెండు, మూడేళ్ల నుంచే ఈ సమస్య ప్రారంభమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నిర్వహణకు పూర్తిగా విస్మరించజంతో బ్యారేజీ దెబ్బతినే వరకు భావిస్తున్నారు. వర్షాకాలం ముందు, తర్వాత చేయాల్సిన తనిఖీలు, ఆప్రాన్ వద్ద ఉన్న స్ట్రక్చర్లను కూడా పట్టించుకోవడంలేదని వారి పరిశీలను తర్వత అంచనాకొచ్చినట్లు తెలిసింది. బ్యారేజీ దిగువన అమర్చిన సీసీస బ్లాకులకు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి కూడా పట్టంచుకోలేదని, వరద ప్రవాహానికి తగ్గట్లుగా డిజైన్ లేకపోవడంతో ఒక్కొక్కటి 20 టన్నులున్న సీసీబ్లాకులు నూరు మీటర్లు దాటి కొట్టుకుపోయినట్లు అధికారుల పరిశీలనలో తెలిసింది.
సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం వల్ల ఇసుకలో కదలిక వచ్చి రాఫ్ట్ దిగువన ఖాళీ ఏర్పడటంతో ఈ సమస్య వచ్చి ఉండవచ్చనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. ఏడో బ్లాకుతో పాటు ఆరు, ఎనిమిదో బ్లాకులలోని పియర్స్‌ను కూడా నిపుణులతో పరిశీలన చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే మరింత బ్యారేజీకి ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.