Medaram Jatara Free Bus Scheme: దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడారం జాతర పేరొందింది. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
Medaram Jatara Special Buses :మరోవైపు ఈ జాతరకు మహిళలకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందా? లేదా అనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. హాలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు స్కీం మేడారం జాతరకు కూడా వర్తింస్తుందని స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్నమేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమైన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్లకు డబ్బులు వసూలు చేస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం.
జనసంద్రంగా మేడారం జాతర - భక్తులతో కిటకిటలాడుతున్న వనదేవతల గద్దెలు