MP Raghunandan Rao As Lawyer On Behalf Of BJP Workers : బీజేపీ కార్యకర్తల తరుపున కోర్టులో వాదించడాని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నల్లకోటు ధరించి కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనను ఇంతవాడిని చేసిన కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు వారి కోసం ముందుండి పోరాడతానని తెలిపారు. గత శనివారం రోజున మెదక్‌లో గో సంరక్షకులకు ఇతర వర్గాల వారికి జరిగిన గొడవలో అరెస్టయిన బీజేపీ కార్యకర్తల తరపున వాకాల్తా పుచుకున్నట్లు రఘనందన్ రావు వెల్లడించారు.
మెదక్ పట్టణంలో ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్డులో హాజరు పరిచారు. అయితే, బీజేపీ నాయకులు, కార్యకర్తల బెయిల్ పిటిషన్పై వాదించేందుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దమయ్యారు. ఈరోజు వారి తరుపున న్యాయవాదిగా నల్లకోటు ధరించి మెదక్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న మెదక్ కోర్టు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
మెదక్ అల్లర్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా- పోలీసులకు కీలక ఆదేశాలు - Union Minister Bandi Sanjay
కోర్టులో వాదనల అనంతరం ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే మెదక్ పట్టణంలో శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడేది కాని పేర్కొన్నారు. జిల్లాలో అక్రమంగా గోవులను తరలిస్తున్న నేపథ్యంలో గత శనివారం గో సంరక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు నిర్ణీత సమయంలో, సరైన విధంగా స్పందించి ఉంటే పరిస్థితి చేయిదాటి పోయేది కాదన్నారు. ఇక్కడ ఎవరూ ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి పిటిషన్ను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్టు వెల్లడించారు. తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. కార్యకర్తల కష్టం వల్లే తాను మెదక్ ఎంపీగా గెలిచానన్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎంపీలకు కేంద్ర పార్టీ ఆధ్వర్యంలో 8 మందికి సన్మాన కార్యక్రమం ఉన్నప్పటికి, తన గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉండేందుకే కోర్టుకు వచ్చానని చెప్పారు. కార్యకర్తలకు న్యాయం జరిగేందు కోసమే చాలా కాలం తరువాత నల్లకోటు ధరించినట్లు వెల్లడించారు. వారికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఇదే తీరుగా స్పందిస్తానని రఘునందన్ రావు తెలిపారు.
మెదక్‌లో రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి - కేటీఆర్