Master Plan-2050 Vision Document :మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో హెచ్ఎమ్డీఏ (HMDA)తో పాటు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు, త్వరలోనే నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు పరిసరాలతో పాటు ఈ 2 ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో సీఎం చర్చించారు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్‌రెడ్డి
HMDA : రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయ్యాక అక్కడి వరకు ఉన్న ప్రాంతాలన్నింటిన హెచ్ఎమ్డీఏ (HMDA) పరిధిలోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ దిశగా సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఓఆర్ఆర్ (ORR) లోపలి ప్రాంతాలను ఒకే యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ వెస్ట్, ఈస్ట్ అనే తారతమ్యాలుండకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అభివృద్ధి జరిగేలా ఒకే ప్రణాళికలు రచించాలని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు చేయాలని సూచించారు. 2050 మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై మరిన్ని కీలక అంశాలు సమీక్షలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy : తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామనిసీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గతంలో వెల్లడించారు. త్వరలో 2050 విజన్ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతోందని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, నగర అభివృద్ది కొనసాగిందని రేవంత్ రెడ్డి వివరించారు.