తెలంగాణ

telangana

ఇదేంటి - ఈ ఇంటి మీద హెలికాప్టర్‌​ దిగిందా? - ఆ ఇంటి వాటర్​ ట్యాంక్​పైకి కారెక్కిందా! - Attractive Water Tanks

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 2:11 PM IST

Attractive Water Tanks in Sangareddy : శాస్త్ర సాంకేతికంగా ఏదైనా ఒక వస్తువు కనిపెట్టాలన్నా, కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా తప్పని సరిగా ఇన్నోవేషన్‌గా ఆలోచించాలి. లేదా శాస్త్రవేత్తలు అయి ఉండాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంత మంది చదువులేని రైతులు, తాపీ మేస్త్రీలు వినూత్న ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు. వీరి నుంచి ఉద్భవిస్తున్న ఆవిష్కరణలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావాల్సిందే. ఇంటి మీదికి కారెక్కిందా, పొరపాటున హెలికాప్టర్ వచ్చి దిగిందా అనే విధంగా వీరి ఆవిష్కరణలు ఉన్నాయి.

Impressive Cars and Helicopter Water Tanks
Attractive Water Tanks in Sangareddy (ETV Bharat)

Impressive Cars and Helicopter Water Tanks : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. పట్టణానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో నిత్యం జనం వస్తుంటారు. ఇక్కడ పని చేసే తాపీ మేస్త్రీలు ఎక్కువే. పేరుకే కాదు విభిన్న రీతుల్లో ఆకృతులను చేపట్టి తమదైన ముద్రను వేస్తుంటారు. ఇళ్లపై కారు, హెలికాప్టర్‌, చైనాలోని నిర్మాణ ఆకృతులను పోలిన నీటి ట్యాంకులను రూపొందించి చూపరులను ఆకట్టుకుంటున్నారు. నిజమైన కారు ఇంటిపైకి ఎలా ఎక్కిందా, ఇంత చిన్న స్థలంలో హెలికాప్టర్‌ ఎలా దిగిందనే సందేహం స్థానికుల్లో కలిగేలా చేసి అబ్బురపరిచేలా నిర్మాణాలు చేపడుతున్నారు.

ఆయా ప్రాంతాల్లో తమ ఇంటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ఈ కళాఖండాలను ఇంటిపై నిర్మించుకున్నామని యజమానులు చెబుతున్నారు. ఫలానా వారి ఇల్లు ఎక్కడ అనగానే ఇంటిపై కారు ఉంది. ఇంటిపై హెలికాప్టర్‌ ఉందనే లాండ్‌ మార్క్‌ని చూపడానికే ఇలా వివిధ ఆకృతులు చేయించుకున్నట్లు యజమానులు చెబుతున్నారు. వారు చేసే వృత్తి అనుగుణంగా తగిన గుర్తింపు ఉండాలని ఖర్చు ఎక్కువైనా వివిధ ఆకృతుల్లో నీటి ట్యాంకులను ఏర్పాటు చేయించుకున్నారు. వానకు తడిచి, ఎండకు ఎండటంతో కొంత మేర రంగు వెలిచిపోవడంతో ఏయేటికాయేడు రంగులను వేస్తూ వాటి అందాన్ని కాపాడుతున్నారు.

మట్టిలో మాణిక్యాలుగా తాపీ మేస్త్రీలు :జహిరాబాద్‌లోని బసవనగర్‌ కాలనీ, దత్తగిరి కాలనీల్లో ఈ వినూత్న ఆవిష్కరణలు దర్శనమిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి యజమానులు ఇంటి పైకప్పుల్లో నీటి ట్యాంకులను విభిన్నంగా నిర్మించుకున్నారు. అందరిలో ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నీటి ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒక్కో నిర్మాణానికి దాదాపు నెల రోజులు తాపీ మేస్త్రీలు తమ ప్రతిభ కనబరిచి తయారు చేశారు. వారికి ఉన్న ప్యాషనే ఈరోజు అద్భుత కళాఖండాలకు అద్దం పడుతోంది.

కళ ఒకరి సొంతం కాదని నిరూపిస్తున్నారు ఈ మేస్త్రీలు. కళకు తగిన ఫలితం కూడా లభించడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. యజమానులు పట్టణంలో తమదైన ముద్ర వేసుకున్నారు. మట్టిలో మాణిక్యాలు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు ఈ తాపీ మేస్త్రీలు. కళ ఒక రంగానికే పరిమితం కాదని నిరూపిస్తున్నారు. ఆయా రంగాల్లో ఆయా ప్రావీణ్యం కలిగిన పనిమంతులు కూడా ఉన్నారు. వారిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తే, మరిన్ని అద్భుతాలు బయటకు వస్తాయనడంలో సందేహం లేదు.

ప్రతి ఇంటిపై ఓ కళాఖండం.. ప్రత్యేక ఆకర్షణగా గ్రామం

ఇల్లు - ఆఫీస్​ - గెస్ట్​హౌజ్​ - ఇక ఏదైనా, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు - ఇప్పుడు ఇదే ట్రెండ్ - Fabricated Mobile house In HYD

ABOUT THE AUTHOR

...view details