Many Snake Catching Societies Available In Hyderabad :గ్రేటర్ రాజధాని రోజురోజుకూ విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో నివాసాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా అప్పటివరకు ఆ ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణాలకు నివాస సమస్య వస్తోంది. అందుకే చాలా శివారు ప్రాంతాల్లో పాముల బెడద పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య మరి ఎక్కువ అవుతోంది. ఇలాంటి సమస్య మీకు వస్తే పామును చూసి భయపడటం కానీ, చంపడం కానీ చేయకుండా మాకు కాల్ చేయండి అంటోంది ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ.
- హైదరాబాద్‌లో ప్రధానంగా సేవలు అందిస్తున్న ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ ఫోన్ నంబరు : 8374933366
- ఈ సంస్థకు చెందిన 120 మందికిపైగా వాలంటీర్లు నగరంలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడ నుంచి ఫోన్ వచ్చినా కేవలం 30 నిమిషాల్లోనే చేరుకుంటారని స్నేక్ సొసైటీ వారు చెబుతున్నారు.
అడవుల నరికివేత ఫలితంగా వన్యప్రాణాలు జనవాసాల్లోకి వస్తున్నాయి. నగరంలోకి కూడా పాములు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో సిగ్నల్ దగ్గరకు వచ్చిన పాము నానా హంగామా చేసింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇటీవల హయత్‌నగర్‌కు చెందిన సింధూ గృహిణి. ఇంట్లో పనులు చేసుకుంటున్న తనకు పాము కనిపించగానే వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన సామాజిక మాధ్యమంలో చూసిన స్నేక్ క్యాచర్స్ గుర్తుకువచ్చారు. ఫోన్ చేయడంతో వారు వచ్చి పామును చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించి జనారణ్యం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు.
మీ ఇంట్లో పాము దూరిందా? - ఈ నెంబర్‌కు కాల్ చేయండి - అరగంటలో పట్టేస్తారు!