Mangalagiri Government Hospital is Being Developing with 100 Beds : ఎన్నికల సమయంలో యువ నాయకుడు లోకేశ్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా హామీలను అమలు చేసిన లోకేశ్ తాజగా మరో హామీని అమలు చేసి చూపించారు. యువగళం పాద యాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని నియోజవర్గం ప్రజలకు మాటిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఈ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. దీంతో మంగళగిరి ప్రజల చిరకాల కల నెరవేరనుంది.
దేశంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ జరిగిందంటే వెంటనే మంగళగిరి గుర్తొచ్చేలా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో నియోజకవర్గం ప్రజల సంతోషం వ్యక్తం చేశారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంగళగిరిలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. కాలక్రమేణా ఆసుపత్రి నిరాదరణకు గురి కావడంతో కేవలం ఓపి సేవలకు మాత్రమే పరిమితమైంది.
ఏపీలో పెట్టుబడులకు దక్షిణ కొరియా సంస్థల ఆసక్తి - మంత్రి లోకేశ్‌తో భేటీ