Manchu Manoj Will File Police Complaint Due To House incident :మంచు కుటుంబంలో వివాదం ఇంకా ముగియలేదు. ప్రస్తుతం మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజా పరిణామాలపై మంచు మనోజ్ విడుదల చేసిన ప్రెస్‌నోటే అందుకు నిదర్శనం. శనివారం తన ఫ్యామిలీలో చోటు చేసుకున్న ఘటన గురించి అందులో వెల్లడించారు. ఈ ఘటనపై రేపు(సోమవారం) ఉదయం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు మంచు మనోజ్ వెల్లడించారు.
మంచు మనోజ్ ప్రెస్‌నోట్‌లో వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి "నిన్న రాత్రి నా కుటుంబంపై దాడికి ప్రయత్నం జరిగింది. నేను లేని సమయంలో నా సోదరుడు, అనుచరులు ఇంట్లోకి వచ్చారు. విష్ణు, అనుచరులు, కొందరు బౌన్సర్లు ఇంట్లోకి ప్రవేశించారు. నా తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో ఇంట్లోకి వచ్చారు. జనరేటర్‌లో చక్కెర కలిపిన డీజిల్ పోసి విఫలమయ్యేలా చేశారు. రాత్రి విద్యుత్ అంతరాయంతో ఆందోళనకు గురయ్యాం.
ఆస్తి, డబ్బు కోసం కాదు - ఇది ఆత్మగౌరవ పోరాటం : మంచు మనోజ్
ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించే పరిస్థితి తలెత్తింది. విష్ణు అనుచరులు నా వద్ద పనిచేసే వారిని ఇంట్లో లేకుండా చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నా కోచ్‌ను బెదిరించారు. నేను, నా కుటుంబం నిరంతరం భయంతో జీవిస్తున్నాం. నాకు న్యాయం చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా" అని మనోజ్ ప్రెస్‌నోట్‌లో వివరించారు. ప్రస్తుతం భయాందోళనకు గురవడంతో తన భార్య ఆరోగ్యం బాగోలేదని వివరించారు. దగ్గరుండి చూసుకోవాల్సినందున బయటకు రాలేకపోతున్నానని తెలిపారు. సోమవారం ఉదయం ఈ వివాదంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ ప్రకటించారు.
మంచు మోహన్‌బాబు కుటుంబం వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం మోహన్‌బాబు, మనోజ్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబ వివాదం జరుగుతున్న సమయంలో మోహన్ బాబు ఓ విలేకరిపై దాడి చేయడంతో మరో కేసు నమోదైంది. తాజాగా మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.
'నా పరువు, ప్రఖ్యాతలు మంటగలిపావు మనోజ్' - మోహన్‌బాబు ఆడియో
"నేను ఇంటికి వెళ్లడానికి అదొక్కటే కారణం - నా భార్య తల్లిదండ్రులు ఉండుంటే ఊరుకునేవారా?"