తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిశ్రమలో బాంబ్​ బ్లాస్టింగ్ -​ బిహార్​ యువకుడు సజీవ దహనం - Man Burnt Alive in medchal - MAN BURNT ALIVE IN MEDCHAL

Man was Burnt Alive at Medchal : పరిశ్రమలో జరిగిన బాంబ్​ బ్లాస్టింగ్​లో బిహార్​ యువకుడు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. అయితే ఈ ఘటన మాత్రం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Man was Burnt Alive at Medchal
Man was Burnt Alive at Medchal

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 3:04 PM IST

Updated : Apr 30, 2024, 4:33 PM IST

Man was Burnt Alive in Bomb Blast at Medchal : పరిశ్రమలో బాంబ్​ బ్లాస్టింగ్​ జరిగి ఓ కార్మికుడు సజీవ దహనమైన ఘటన మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఈ ఘటన సోమవారం జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాంబ్​ బ్లాస్టింగ్​ ఘటనలో ఇంకా ఎవరికైనా ఏమైనా జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరిలోని కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అంకిరెడ్డి పల్లి గ్రామ శివారులోని సాల్వో ఎక్సోజివ్స్​ పరిశ్రమలో బిహార్​కు చెందిన సోనూకుమార్​ కార్మికుడు పని చేస్తున్నాడు. సాల్వో బాంబుల పరిశ్రమలో అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో సెప్టిక్​ ఆసిడ్​ ప్రిపరేషన్​ డిటోనేటర్​ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అందులో ఉన్న సోనూ కుమార్​ సజీవ దహనం అయ్యాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి ఆనవాలు కూడా లేకుండా పూర్తిగా దగ్ధమైపోయాడు. ఈ పేలుడుకు ప్లాంట్​ మొత్తం పూర్తిస్థాయిలో నేల మట్టం అయింది. దీంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్​లో కార్మికుడు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్​- ఐదుగురు సజీవ దహనం- మృతుల్లో ముగ్గురు చిన్నారులు

మృతుడు బిహార్​ వాసి : మృతుడు సంవత్సర కాలంగా ఇదే పరిశ్రమలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోనూకుమార్​ బిహార్​ రాష్ట్రంలోని అన్సాన్​పుర జిల్లా కేంద్రానికి చెందినవాడుగా గుర్తించి, అతని బంధువులకు సమాచారం అందించారు. అయితే ఘటన జరిగిన అనంతరం పరిశ్రమలోని ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఈ ప్రమాదం మానవ తప్పిదమా లేక పరిశ్రమలో ఏదైనా పొరపాటు జరిగిందా అన్న కోణంలో దర్యాప్తును పోలీసులు చేపట్టారు. కానీ ఈ ఘటన సోమవారం జరిగితే మంగళవారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Driver Burnt Alive in Lorry Accident Peddapalli : లారీని ఢీకొట్టిన మరో లారీ.. డ్రైవర్ సజీవదహనం.. కొద్దిలో తప్పించుకున్న క్లీనర్

Youth died after car explodes : భారీ శబ్దంతో కారులో పేలుడు.. వ్యక్తి సజీవ దహనం.. వాహనం దగ్ధం

Last Updated : Apr 30, 2024, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details