తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నతో మందు సిట్టింగ్ - అలా బయటకు వెళ్లగానే ఆయన ఫ్యామిలీని చంపి సూసైడ్ - TRIPLE MURDER IN TIRUPATI - TRIPLE MURDER IN TIRUPATI

Man Kills Brother's Family in Tirupati : ఏపీలోని తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వదిన, ఆమె ఇద్దరు పిల్లలను మరిది కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Brutal Murder in Tirupati
Brutal Murder in Tirupati in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 8:36 AM IST

Updated : Jul 25, 2024, 9:54 AM IST

Man Kills Brother's Family in Tirupati :కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసిన ఓ వ్యక్తి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని తిరుపతి పద్మావతినగర్‌లో కలకలం రేపుతోంది. పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్‍ ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను హతమార్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్​ చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్‍ తెలిపారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం : తిరుపతి పద్మావతి నగర్‌లోని ఓ ఇంట్లో టీపీ దాస్‌ అనే వ్యక్తి నివసిస్తున్నారు. దాసు తమ్ముడు మోహన్‌ (35) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 2019లో మోహన్‌కు వివాహం అయింది. అయితే కొన్ని కారణాలతో 2020లో దంపతులు విడిపోయారు. ఇటీవల అన్నావదినలు మోహన్​కి రెండో పెళ్లి చేశారు. అయితే ఆ అమ్మాయి కూడా మోహన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో అతను మానసికంగా కుంగిపోయాడు.

బుధవారం తన దాసు నివాసంలో సాయంత్రం అన్నతో కలిసి మోహన్ మద్యం తాగాడు. అనంతరం దాసు బయటికి వెళ్లాడు. అప్పుడే ట్యూషన్‌ నుంచి వచ్చిన దాసు కుమార్తెలు దేవశ్రీ (13), నీరజ (10), భార్య సునీత (40)లను మోహన్‌ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. వారంతా రక్తం మడుగులో ఉండగా, వారి మృతదేహాలను బయటికి తరలించేందుకు యత్నించాడు. అయితే చుట్టుపక్కల ప్రజలు బయటే తిరుగుతుండటంతో భయంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ అన్న దాసు ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాపిల్లలు హాలులో రక్తం మడుగులో పడి ఉన్నారు.

లోపలి గదిలో మోహన్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు దారి తీసిన పరిణామాలు తెలియని నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు అన్నతో మద్యం తాగిన తమ్ముడు, ఆయన బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నా పెళ్లాన్ని నాకు దూరం చేస్తారా? - కోపంతో యువతి తల్లిదండ్రులను చంపిన యువకుడు - YOUNG MAN KILLS LOVER PARENTS

ఆస్తి కోసం యువతిని హత్య చేసిన అక్కాబావ

Last Updated : Jul 25, 2024, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details