తెలంగాణ

telangana

ETV Bharat / state

గూగుల్​మ్యాప్స్​ను నమ్మారు - సీదా పోల్​కు ఢీ కొట్టారు - MAN GETS ACCIDENT BY TRUSTING GPS

గూగుల్​మ్యాప్స్​ను నమ్మి రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులు - ఓ వ్యక్తి రెండు కాళ్లకు తీవ్రగాయాలు

Man Gets Into Road Accident After Trusting Google Maps in Amberpet
Man Gets Into Road Accident After Trusting Google Maps in Amberpet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2025, 7:16 PM IST

Man Gets Into Road Accident After Trusting Google Maps in Amberpet :గూగుల్​ మ్యాప్స్​ నమ్మి బైక్​పై వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన హైదరాబాద్​లోని కాచిగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అంబర్​పేట్​లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈసీఐఎల్​కు చెందిన ఇమాముద్దీన్​ గతరాత్రి ఒంటిగంట సమయంలో తన మిత్రుడు విశ్వజిత్​తో కలిసి ఎంజీబీఎస్​ నుంచి ఈసీఐఎల్​కు బయలుదేరాడు. అయితే ఈసీఐఎల్​కు వెళ్లడానికి గూగుల్​ మ్యాప్స్​ను ఆన్​ చేసుకున్నారు. మ్యాప్స్​ను తన ఫోన్లో ఆన్​ చేసిన ఇమాముద్దీన్​ విశ్వజిత్​కు ఇచ్చాడు. వారిద్దరు గోల్నాక సమీపంలో ఫోన్లో​ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్​ నుంచి వెళ్లాలని దారి చూపించింది. దీంతో వారిద్దరు ప్లైఓవర్​ పైకి వెళ్లారు. చిమ్మ చీకటిలో ఫ్లైఓవర్​ పై అడ్డంగా ఉన్న పైపును ఢీ కొట్టడంతో కింద పడ్డారు.

గూగుల్​మ్యాప్స్​ను నమ్మారు - సీదా పోల్​కు ఢీ కొట్టారు (ETV Bharat)

దొంగను పట్టించిన గూగుల్ మ్యాప్స్!​- ఎలా పట్టుకున్నారంటే?

నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్​ పనులు తుది దశకు వచ్చాయి. కాంట్రాక్టర్ ఫ్లైఓవర్​ పైకి ఎవరు వెళ్లకుండా ఇనుప స్తంభాన్ని అడ్డంగా పెట్టాడు. దాన్ని గమనించని వారు గూగుల్ మ్యాప్​ను నమ్ముకొని వేగంగా వెళ్లడంతో స్తంభానికి తగిలి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇమాముద్దీన్​ రెండు కాళ్లకు తీవ్ర గాయలయ్యాయి. వెనుక కూర్చున్న అతని మిత్రుడు విశ్వజిత్​కు స్వల్ప గాయలయ్యాయి. ఇమాముద్దీన్​ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్లైఓవర్​పైకి ఎవరు ఎక్కకుండా ప్రారంభంలోనే పెట్టాల్సిన పోల్​ను మధ్యలో పెట్టడం సరికాదన్నారు. అంబర్​పేట్​లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గూగుల్ రాంగ్​రూట్ నావిగేషన్ - ప్రాజెక్టులోకి దూసుకెళ్లిన వ్యాన్​

ABOUT THE AUTHOR

...view details