తెలంగాణ

telangana

ETV Bharat / state

150 దేశాల కాయిన్స్, కరెన్సీ నోట్లు, స్టాంపుల సేకరణతో ప్రత్యేకత చాటుకుంటున్న నర్సాపూర్​ వాసి - ancient Coins Currency in Narsapur

Man collected 150 countries Coins and Currency in Narsapur : మెదక్‌‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన జీడిమెట్ల యాదగిరి చేసేది లైబ్రేరియన్‌‌ ఉద్యోగం అయినా ప్రవృత్తి మాత్రం విభిన్న రకాల కాయిన్స్‌‌, కరెన్సీ నోట్లు, స్టాంపుల సేకరణ. ఆయన వద్ద దాదాపు 150 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ నోట్లు ఉన్నాయి. రాజులు, నవాబుల కాలం నాటి నాణేలు, కరెన్సీ నోట్లు ఆయన వద్ద ఉండటం విశేషం.

Man Collected Coins and Currency Notes of Kings and Nawabs
Man collected 150 countries Coins and Currency in Narsapur

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 9:57 PM IST

150 దేశాల కాయిన్స్, కరెన్సీ నోట్లు, స్టాంపుల సేకరణతో ప్రత్యేకత చాటుకుంటున్న నర్సాపూర్​ వాసి

Man collected 150 countries Coins and Currency in Narsapur :యాదగిరి 1997లో తూప్రాన్‌‌ లైబ్రరీలో రికార్డు అసిస్టెంట్‌‌గా ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత పదోన్నతిపై మెదక్‌ వచ్చాడు. లైబ్రరీలో వివిధ దిన పత్రికలు, మేగజైన్‌లు చదువుతుండగా వెరైటీ కాయిన్‌‌లు, కరెన్సీ నోట్లు సేకరించిన వారి గురించి ప్రచురితమయ్యే వార్తలు చూసి తనకు అలాంటివి సేకరించాలని ఆసక్తి కలిగింది. దీంతో నాణేలను సేకరించి ఇంట్లో టేబుల్‌‌ డ్రాలో దాచడం మొదలుపెట్టాడు. ఏదైనా కాయిన్‌‌ కొత్తగా కనిపిస్తే దాని విలువకు తగిన డబ్బు ఇచ్చి ఆ కాయిన్లు తీసుకునే వాడు.

పురాతన కాలం నాటి, వెరైటీగా ఉన్న కాయిన్స్‌ ‌కోసం డబ్బుకు వెనుకాడకుండా వారు అడిగినంత ఇచ్చి దానిని తీసుకునేవాడు. నాణేలు, కరెన్సీ నోట్లతోపాటు విభిన్న రకాల ప్రత్యేకమైన పోస్టల్‌‌ స్టాంపులనూ యాదగిరి సేకరించారు. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో స్టాంపులతో పాటు బ్రిటీష్‌‌ జనరల్స్‌‌ వాడిన, వాళ్ల చేతిరాతతో ఉన్న ఎన్వలప్‌‌ కవర్‌‌లు సేకరించడం విశేషం. ప్రముఖుల చిత్రాలతో ఉన్న స్టాంపులతోపాటు, దాదాపు 100 దేశాలకు చెందిన స్టాంపులను ఆయన సేకరించి భద్రపరిచారు. పురాతన కాలం నాటి పంచింగ్‌‌ కాయిన్స్‌‌తో పాటు, రామటెంకీలు, తూటు పైసలు, టిప్పుసుల్తాన్ కాలం, ట్రావెన్‌‌ కోర్‌‌ దేవస్థానం నాటి, నాణేలు ఎన్నో ఉన్నాయి.

Man Collected Coins and Currency Notes of Kings and Nawabs :హిట్లర్‌‌ బొమ్మతో ఉన్న కాయిన్‌‌తోపాటు, శ్రీలంక క్రికెట్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ గెలిచిన సందర్భంగా ఆ దేశం ప్రత్యేకంగా ముద్రించిన 5 రూపాయల నాణెం కూడా ఆయన వద్ద ఉంది. వివిధ సందర్భాల్లో తన వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, పోస్టల్‌‌ స్టాంపుల ప్రదర్శన చేస్తున్నారు. భవిష్యత్తులో జిల్లాలోని ప్రతి మండలంలో నాణేలు, కరెన్సీ, స్టాంపుల ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి గొప్పదనాన్ని ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు వివరించడమే తన ముందున్న ధ్యేయమని యాదగిరి వివరించారు.

'కాయిన్స్​ కలెక్షన్స్​ అనేది 1997 నుంచి నాకు అలవాటుగా మారిపోయింది. అప్పటి నుంటి కలెక్ట్​ చేస్తున్నాను. వివిధ దేశాలకు చెందిన స్టాంపులు ఉన్నాయి. ​స్వాతంత్రం రాక ముందు బ్రిటీష్‌‌ కాలంలో ఉన్న ఎన్వలప్‌‌ కవర్‌‌లను సేకరించాను. 1947 తర్వాత తపాలా శాఖ మూడు రకాల స్టాంపులను విడుదల చేసింది. ఆ మూడు రకాల స్టాంప్స్​ కూడా నా దగ్గర ఉన్నాయి.'- జీడిమెట్ల యాదగిరి, పురాతన నాణేల సేకర్త

'ఇంగ్లీష్‌ మీరే కాదు మేమూ మాట్లాడగలం - అదీ గుక్కతిప్పుకోకుండా' - ఆంగ్లంలో అదరగొట్టేస్తున్న విద్యార్థినులు

త్రీడీ ఆర్ట్​తో ఆశ్చర్యపరుస్తోన్న పెద్దపల్లి వాసి - 12 ప్రపంచ రికార్డులు సొంతం

ABOUT THE AUTHOR

...view details