Man and Woman Killed in Extramarital Relationship Puppalaguda : పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. వివాహేతర బంధమే ప్రాణాలు తీసిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కొద్దిరోజుల ముందు వీరిద్దరూ అదృశ్యమైనట్టు వేర్వేలు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో హత్యకు గురైంది అంకిత్ సాకేత్, బిందు దివాకర్‌గా నిర్ధారించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు,
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు, దివాకర్ దంపతులు ఉపాధి కోసం తెలంగాణకు వచ్చారు. మొదట్లో ఈ దంపతులు శంకర్‌పల్లిలో నివాసం ఉండేవారు. అక్కడ దివాకర్ ప్లంబర్‌గా పని చేసేవాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అక్కడ నివసించే సమయంలో హౌస్ కీపింగ్ పని చేసే సాకేత్‌తో బిందుకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న దివాకర్, తన కుటుంబాన్ని వనస్థలిపురంలోని చింతల్‌కుంటకు మార్చాడు.
రంగారెడ్డి జిల్లా జంట హత్యల కేసులో ట్విస్ట్ - వివాహేతర సంబంధమే కారణమా?
స్థానికుల సమాచారంతో : కాగా కొన్ని రోజుల క్రితం బిందు, సాకేత్ ఇళ్ల నుంచి బయటకెళ్లారు. భార్య కనిపించడం లేదంటూ ఈ నెల 8న దివాకర్ వసన్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 11న సాకేత్ మాయమయ్యాడని తన సోదరుడి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 14న పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో రెండు మృతదేహాలున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్, ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు.