Wife Killed Husband For Her Illegal Relation With lover :ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, అతనితో కలిసి భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మృతి చెందాడని అందరినీ నమ్మబలికింది. బంధువులు సహా అందరినీ నమ్మించి అంత్యక్రియలు సైతం చేయించింది. అయితే హత్య చేసిన నిందితుల్లో ఒకరు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఈ పన్నాగం అంతా బయటపడింది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్లో విజయ్‌కుమార్, శ్రీలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే శ్రీలక్ష్మి పెళ్లికి ముందు రాజేశ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే ఇది ఎప్పటికైనా తన భర్తకు తెలిస్తే ఇబ్బందేనని శ్రీలక్ష్మి భావించి, భర్త విజయ్ కుమార్ (40) అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయం రాజేశ్‌తో చెప్పడంతో అతడు సరేనన్నాడు.
తనకు పరిచయమున్న సనత్‌నగర్‌కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి మద్దతు కోరాడు. రౌడీషీటర్ అయిన రాజేశ్వర్ రెడ్డిపై ఇదివరకే మొత్తం 8 కేసులు ఉన్నాయి. రాజేశ్వర్ రెడ్డి సూచనతో మహ్మత్ మైతాబ్ అలియాస్ బబ్బన్ సాయం కూడా హత్య చేయడానికి తీసుకున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న విజయ్‌కుమార్ తన పిల్లల్ని పాఠశాలలో దింపేందుకు వెళ్లాడు. అప్పటికే ఇంటి సమీపంలో ఉన్న రాజేశ్, పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్‌ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి, బాత్రూంలో దాచింది.
హైదరాబాద్‌లో దారుణం - తీసుకున్న రూ. 13 వేలు తిరిగి ఇవ్వలేదని యువకుడిని హతమార్చిన ఫ్రెండ్స్ - young person murder in hyderabad
పిల్లల్ని స్కూల్లో దింపి రాజేశ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడి పెట్టింది. వెంటనే రాజేశ్, రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చి కసరత్తులకు ఉపయోగించే డంబెళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా విజయ్‌పై దాడి చేశారు. అప్పుడు విజయ్ భయంతో తనను చంపొద్దని, కావాలంటే ఎంతైనా కొట్టి వదిలేయాలని ప్రాదేయపడ్డాడు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ ముగ్గురు అతన్ని చంపేశారు. విజయ్ మరణించాడని నిర్ధారించుకున్న ఆ ముగ్గురు, మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసి వెళ్లిపోయారు. అనంతరం శ్రీలక్ష్మి ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి, శవంపై దుస్తులను మార్చేసి తన భర్త గుండెపోటుతో మరణించాడని నాటకం మొదలుపెట్టింది. శ్రీలక్ష్మిని నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు నిజమేననుకుని విజయ్ అంత్యక్రియలు జరిపించేశారు.
పశ్చాత్తాపంతో లొంగిపోయిన నిందితుడు :విజయ్ హత్య అనంతరం రాజేశ్వర్ రెడ్డి వికారాబాదాద్ వెళ్లిపోయాడు. విషయం బయటకు పొక్కితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని మూడన్నర నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విజయ్ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడం తనకు పదే పదే గుర్తుకొచ్చి, పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. దీంతో గురువారం మధురానగర్ ఠాణాకు వచ్చి జరిగిన తతంగమంతా చెప్పేశాడు. ఒక వ్యక్తిని చంపినందుకు మానసిక ప్రశాంతత కరవైందని, తను లొంగిపోతున్నట్లు పోలీసులకు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, రాజేశ్వర్ రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేశ్, మైతాబ్‌పై కేసు నమోదు చేశారు.
ఇంట్లో ఎవరూ లేరంటూ పిలిచి - భర్తతో కలిసి ప్రియుడిని కడతేర్చిన వివాహిత