LPG Gas Subsidy Update :కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కొంతమేర సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా వంటగ్యాస్ వాడేవారు సిలిండర్ బుక్ చేసి డెలివరీ అయిపోయిన తర్వాత ఈ రాయితీ డబ్బులు నేరుగా అకౌంట్లోకి జమ అవుతాయి. అయితే కొంతమందికి పలు కారణాల వల్ల సబ్సిడీ పడకపోవచ్చు. అలాగే కొందరికి సబ్సిడీ వచ్చినా అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయో చెక్ చేసుకోవడం తెలియదు. అదేవిధంగా ఇప్పటికీ ఈ-కేవైసీ(LPG e-Kyc) ప్రక్రియను పూర్తి చేయనివారు ఉంటే ఇప్పుడే ఈజీగా ఇంటి వద్ద నుంచే ఆ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Gas Subsidy Check Online :చాలా మందికి గ్యాస్ సిలిండర్‌పై వచ్చే సబ్సిడీని ఎలా చెక్ చేసుకోవాలో చేయాలో తెలియదు. అలాంటి వారు ఈజీగా ఫోన్లో మీకు ఎంత సబ్సిడీ వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే దీనికోసం ముందుగా మీ ఎల్‌పీజీ ఐడీ తెలుసుకొని ఆ తర్వాత సబ్సిడీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం..
- మీరు ముందుగా http://mylpg.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- అక్కడ పైన కుడి వైపున మీ LPG IDకి సంబంధించిన వివరాలు తెలుసుకునే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ గ్యాస్ కంపెనీ పేరు అడుగుతుంది. అక్కడ కనిపించే ఆప్షన్లలో మీరు వాడే కంపెనీ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఫోన్ నంబరు లేదా గ్యాస్ పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ పేరు, వినియోగదారుని నంబరు వంటి వివరాలు అడుగుతోంది. అవి పూర్తి చేయాలి.
- అనంతరం అక్కడ కనిపించే captcha code (క్యాప్చా కోడ్) ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు LPG ID వస్తుంది.
- ఇప్పుడు ఈ స్టెప్స్ ద్వారా గ్యాస్ సబ్సిడీ తెలుసుకోవచ్చు..
- మళ్లీ మీరు పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. పైన కుడి వైపున కనిపించే ఖాళీల్లో మీ LPG ID ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబరు నమోదు చేసి.. ఆపై అక్కడ కనిపించే captcha నింపాలి.
- ఇదంతా చేసిన తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఫిల్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఒక పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ ఈ-మెయిల్‌కు యాక్టివేషన్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
- ఆపై ఒకసారి http://mylpg.in/ ఓపెన్ చేసి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయ్యాక అక్కడ View Cylinder Booking History / subsidy transferred ఆప్షన్లపై క్లిక్ చేసి ఈజీగా మీ సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చు.