Rain Alert in Andhra Pradesh State : బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం రేపటిలోగా విస్తరించే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం (డిసెంబర్ 15) రోజు అల్పపీడనంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
దీని ప్రభావంతో సోమవారం (డిసెంబర్ 16) ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళవారం(డిసెంబర్ 17) కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. వ్యవసాయ పొలాల్లో పనిచేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.