Young Lovers Committed Suicide in Suryapet :రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
సమాజం, కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా వారు ఒకరిని ఒకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని నిండునూరేళ్లు సంతోషంగా బతకాలి అనుకున్నారు. కానీ కులం కారణంగా వారి జీవితం మధ్యలోనే ఆగిపోయింది. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఆ ప్రేమికులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చావైనా బతుకైనా కలిసే ఉందామని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తమ పెళ్లిని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Lovers suicide in Kamareddy : పెద్దలను ఎదిరించి.. జీవితంలో ఓడిపోయి.. ప్రేమికుల ఆత్మహత్య
పోలీసుల వివరాల ప్రకారం: గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ (25), ఆ గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి (23) ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని గతంలోనే నాగజ్యోతి ఇంట్లో తెలుపగా ఆమె తండ్రి నిరాకరించాడు. అప్పటినుంచి వారిద్దరు కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటూనే వీరి ప్రేమను ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నాయి.