తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం - Lovers Suicide in Mancherial

Lovers Committed Suicide in Mancherial District : తల్లిదండ్రులు ప్రేమకు నిరాకరించారని యువతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోగా, ఆమె ఆత్మహత్యను తట్టుకోలేక యువకుడు పురుగుల మందు తాగి మరణించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. మరోవైపు నిజామాబాద్​ జిల్లాలో డిప్రెషన్ కారణంగా భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నారు.

Lovers Committed Suicide in Mancherial District
Lovers Committed Suicide

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 9:16 PM IST

Updated : Mar 14, 2024, 6:49 AM IST

Lovers Committed Suicide in Mancherial District : పాఠశాలలో చిగురించిన ప్రేమను పెళ్లి వరకు తీసుకొని వెళ్లాలని అనుకున్న ప్రేమికుల ఆశ మధ్యలోనే అడియాశ అయింది. ఇద్దరి కులాలు ఒకటే అయినా పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య(Lady Committed Suicide) చేసుకోగా, యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హృదయాలను హత్తుకొనే ఈ యధార్థ ప్రేమ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాలోని మామిడి గట్టు గ్రామానికి చెందిన సంగీతకు నెన్నెల మండలం చిత్తాపూర్​ గ్రామానికి చెందిన భగవాన్​ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పాఠశాలలో చదివే సమయంలో చిగురించిన ప్రేమ డిగ్రీ పూర్తయ్యే వరకు కొనసాగింది. కులాలు ఒకటే కావడంతో ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సంగీత ఇంట్లో విషయం తెలియడంతో ఆమెను కుటుంబ సభ్యులు మందలించారు. కుటుంబ సభ్యులు మందలించారన్న మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Telangana Crime News :ఈ విషయం డీసీఎం వ్యాన్​ నడుపుతున్న భగవానుకు తెలియడంతో మార్గమధ్యలో ఓ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశాడు. బెల్లంపల్లి మండలం దుగ్న పెళ్లి గ్రామం సమీపంలోని మామిడి తోటలోకి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. భగవాన్​ మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, సంగీత మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల రోదనలతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

రంగారెడ్డి జిల్లాలో విషాదం - ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకున్న భార్యభర్తలు : ఇంటర్​ మొదటి ఏడాది చివరి పరీక్ష రాసి ఆనందంగా ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండడం చూసి కన్నీరు మున్నీరయ్యాడు. నిజామాబాద్​ జిల్లా పట్టణంలోని ఐదో పోలీస్​ స్టేషన్​ పరిధిలో దంపతులు స్వామి(45), దేవలక్ష్మి(40) చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యను తాడుతో బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన స్వామి అనంతరం ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Husband and Wife Suicide in Nizamabad : చనిపోయే ముందు వాట్సాప్​లో డిప్రెషన్​ కారణంగా తాను చనిపోతున్నట్లు వాయిస్​ మెసేజ్​ పెట్టాడు. ఇంటర్​ మొదటి ఏడాది చివరి పరీక్ష రాసి ఇంటికి వెళ్లిన కుమారుడికి విగత జీవులై తల్లిదండ్రులు కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

స్నేహితురాలు కలలోకి వచ్చి రమ్మంటోందని - మహిళ ఆత్మహత్య

మరో పదిరోజుల్లో వివాహం - అంతలోనే యువతి ఆత్మహత్య

Last Updated : Mar 14, 2024, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details