తెలంగాణ

telangana

ETV Bharat / state

మందు బాబులకు బ్యాడ్​న్యూస్ - తెలంగాణలో నిలిచిపోయిన మద్యం సరఫరా

రాష్ట్రంలో నిలిచిపోయిన మద్యం సరఫరా - సర్వర్ స్తంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన మద్యం సరఫరాకు బ్రేకులు - డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి

Liquor Supply Stopped In Telangana
Liquor Supply Stopped In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 7:36 PM IST

Liquor Supply Stopped In Telangana : రాష్ట్రంలో మందుబాబులకు ఇది మింగుడు పడని వార్తే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం డిపోలలో లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. వైన్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రూపొందించిన సాప్ట్​వేర్​లో సాంకేతిక సమస్యలే ఇందుకు కారణం. ఫలితంగా సర్వర్ స్తంభించి రాష్ట్రం మొత్తం లిక్కర సప్లైకు బ్రేకులు పడ్డాయి. దీంతో డీడీలు కట్టి డిపోలకు వెళ్లిన డీలర్లు సర్వర్ హ్యాంగ్ అయిందన్న సమాచారంతో మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

చాలాకాలంగా రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్​లైన్ విధానం ద్వారానే జరుగుతోంది. డీలర్లకు వేగంగా లిక్కర్ సరఫరాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఎంత సరుకు ఉంది, డీలర్లు ఎంత తీసుకెళ్లారో స్పష్టంగా తెలిసేందుకు అధికారులు ఆన్​లైన్ విధానం తీసుకొచ్చారు. పూర్తి పారదర్శకంగా ఉన్న ఈ పద్ధతి అటు అధికారులకు, ఇటు డీలర్లకు ఉపయోగకరంగానే ఉంది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో సర్వర్ హ్యాంగ్ కావడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సమస్యను వేగంగా పరిష్కరించాలని అబ్కారీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వర్​ను రీస్టోర్ చేసే పనుల్లో ఉన్నారు. రాత్రి లోపు సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.

సర్వర్ సమస్య వల్ల ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో మద్యం సమస్య రాకపోయినా, రాత్రి వరకు ఇదే పరిస్థితి వస్తే మాత్రం మందు బాబులకు కష్టకాలమేనని తెలుస్తోంది. స్టాక్ తక్కువగా ఉన్న చోట్ల డిమాండ్ పెరిగి బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉంది. అయితే సమస్య అంతవరకు రాకుండా వీలైనంత త్వరగా రాత్రి వరకు ఆన్​లైన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details