తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు - Rain Alert in Telangana - RAIN ALERT IN TELANGANA

weather Updates : రాష్ట్రంలో గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగాల మూడో రోజులు కూడా ఉరుములు, మెరుపులతోకూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Rain Updates in Telangana
weather Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 3:53 PM IST

Rain Updates in Telangana : రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం మాత్రం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. గురువారం నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి మెదక్‌, భద్రాచలం గుండా వెళ్తుందని తెలిపారు.

మరోవైపు నైరుతి రుతుపననాలు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్​లో మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి. రాబోయే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్​లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్​లో ఆయా పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.

ఆయా చోట్ల మొదలైన వర్షాలు :బుధవారం హైదరాబాద్​తో పాటు యాదాద్రి, సంగారెడ్డి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్​లోని కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఆయా చోట్లు ట్రాఫిక్​ స్తంభించిపోయింది. జీహెచ్​ఎంసీ సిబ్బంది సైతం నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందే డ్రైనేజీ, కాలువలో చెత్తను తొలిగిస్తున్నారు.

రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఎండలు దంచికొట్టగా బుధవారం నుంచి నైరుతి రుతుపనాలు ప్రవేశించి కాస్త చల్లబడింది. మరోవైపు సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు సైతం వర్ష సూచనలు ఉండటంతో కుదటపడ్డారు. గత సంవత్సరం కంటే ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈసారి అయినా వర్షాలు బాగా పడి పంటలు వృద్ధిగా పండాలని రైతులు కోరుకుంటున్నారు.

హైదరాబాద్​లో భారీ వర్షం, రోడ్లపై పోటెత్తిన వరద నీరు - పలుచోట్ల ట్రాఫిక్​జామ్ - Heavy Rains in Telangana

నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - TELANGANA RAINS ALERT TODAY

ABOUT THE AUTHOR

...view details