Lavanya About Hero Raj Tarun : సినీ హీరో రాజ్‌తరుణ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని నటి లావణ్య ఆరోపించారు. అతనితో తనకు ప్రాణ భయం ఉందని లావణ్య అందోళన వ్యక్తం చేశారు. తనపై కావాలనే డ్రగ్ అడిక్ట్‌లాగా క్రియేట్ చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. మస్తాన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. రాజ్ తరుణ్ మాల్వీని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని, అతను అన్ని రకాలుగా తనను వాడుకొని, ఇప్పుడేమో మాల్వీతో ఉన్నారని తెలిపారు. తనకు రాజ్‌తరుణ్ కావాలని, ఆయన లేకపోతే తాను బతకలేనని పేర్కొన్నారు.
"రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. మాల్వి మల్హోత్రాను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అతనితో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను కావాలనే డ్రగ్ అడిక్ట్‌లాగా క్రియేట్ చేస్తున్నాడు. మస్తాన్‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నన్ను వదిలించుకోవడానికి ఆరోపణలు చేస్తున్నాడు. 11 సంవత్సరాలుగా కలిసి సహజీవనం చేస్తున్నాం. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. మల్హోత్రా తమ్ముడు నన్ను బెదిరించాడు. దానికి సంబంధించిన సాక్షాలు కూడా ఉన్నాయి." -లావణ్య, నటి
ఆధారాలు చూపించండి : తనతో సహజీవనం సాగిస్తున్న సినీ నటుడు రాజ్‌తరుణ్ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే నార్సింగి పోలీసులు శుక్రవారం లావణ్యకు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పేర్కొంటూ 91 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశారు.