తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇలా అయితే ప్రతిరోజూ పండగే - ఈ దసరాకు ఇలా ట్రై చేసి చూడండి - FUN TIME FAMILY ON FESTIVAL

పండుగకు కొత్తగా ప్లాన్​ చేద్దాం - సరదాగా గడుపుదాం - లెక్కలేనన్ని మధర జ్ఞాపకాలను మూటకట్టుకుందాం

Let's Have Fun With Family Members During The Festival
Let's Have Fun With Family Members During The Festival (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 10:41 AM IST

Let's Have Fun With Family Members During The Festival :పండుగా అంటేనే అయిన వారందరినీ కలుసుకోవడం, ఆనందాలను పంచుకోవడం, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం. పది కాలాల పాటు పదిలపరుచుకునే మరిన్ని అనుబంధాలను దాచుకోవడం. పండుగ పూట ఇలాంటి తీపి జ్ఞాపకాలు పొందాలంటే అందరూ కలిసి ఓ చక్కని ప్రణాళిక ఏర్పరుచుకుంటే ఎన్నో మధురిమలను మూటగట్టుకోవచ్చు కదా!

చెరువు గట్లు తిరిగేవాళ్లం : ఇదిగో మణుగూరుకు చెందిన రామారావు కుటుంబం కుమారుడు, కోడలు పండుగ సెలవుల్లో హైదరాబాద్‌ నుంచి వచ్చారు. మనుమలు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. దీంతో ఇల్లంతా ఒకటే సందడి. అందరూ సరాదాగా మాట్లాడుకుంటున్నారు. పండుగను సంతోషంగా గడపాలనుకున్న వారు అందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ‘ఒకప్పుడు పండుగలు ఎంతో సంతోషంగా గడిచేవి. కానీ రానురానూ వాటి కళ పోతోంది. పండుగనో, దావత్​ అనో అందరూ కలిసినా పిల్లలు, పెద్దలు, సెల్​ఫోన్లు, కంప్యూటర్లతోనే కాలం గడుపుతున్నారు. ఎవ్వరూ లేనట్టూ ఎవరికి వారే ఒంటరిగా ఉంటున్నారు. తెలుసా పిల్లలు పండగ వచ్చిందంటే నేనూ, నా స్నేహితులందరం కలిసి సరాదాగా పచ్చని పొలాలు, చెరువు గట్ల వెంట తిరిగేవాళ్లం. ప్రకృతి అందాలను ఆస్వాదించేవాళ్లం. తోటల్లో హాయిగా చెట్ల కింద సేదతీరే వాళ్లం, ఆటలాడే వాళ్లం. పండుగ పూట ఆ రోజంతా ఆనందంగా గడిచిపోయేది. అసలు సమయం కూడా తెలిసేది కాదు. రామారావు మాటలు పూర్తి కాకుండానే మనుమడు, మనుమరాళ్లు ఉత్సుకతతో ఆయన చుట్టుముట్టారు. ‘తాతయ్యా మాకూ పంట పొలాలు, చెరువు గట్లు చూడాలనుంది. మమ్మల్ని తీసుకెళ్లండి’ అంటూ మారాం చేశారు. వాళ్ల తాతయ్యతో 'వీడియో గేమ్స్ బంద్, సెలవు రోజులన్నీ మీతోనే గడుపుతాం' అంటూ ప్రామిస్ చేశారు.

పుస్తకాలు, న్యూస్ ​పేపర్లు చదువుదాం :కుమారుడు తరుణ్‌ జోక్యం చేసుకుంటూ ‘పుస్తకాలు, దిన పత్రికలు చదవటమూ ఈ రోజుల్లో తగ్గిపోయింది. ఎంతసేపూ సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అంటూ సమయం వృథా చేస్తున్నారు. వాటివల్ల అవగాహన స్థాయి పెరగదు. ఎలాంటి అనుభూతీ కలగదు. పైగా ఒకే దగ్గరే ఉండి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అదే ఏదైనా ఓ మంచి పుస్తకం, దినపత్రిక చదివితే కలిగే ఆనందం వేరు. దినపత్రికల్లోనూ ఇటీవల చాలా మార్పులు సూటిగా, స్పష్టంగా తక్కువ వాక్యాల్లోనే కీలక విషయాలు, భావాలను వ్యక్తపరుస్తున్నాయి. న్యూస్​ పేపర్లు, పుస్తక పఠనం వల్ల సమాజ పోకడ అవగతమవుతుంది. వివేకం పెరుగుతోంది. ఈ హాలీడేస్​ అన్నీ సెల్‌ఫోన్‌ను పక్కనపెట్టి మీ అందరితో గడుపుతూ రోజూ దినపత్రిక చదివేందుకు ప్రయత్నిస్తా. ఓ మంచి పుస్తకం చదవాలనుకుంటున్నాను' అని వాళ్లందరికి చెప్పారు.

ఆన్​లైన్ పేమెంట్​తో మొదలైన లవ్​స్టోరీ - భర్త, పిల్లలను వదిలి లండన్​ నుంచి వచ్చేలా చేసింది

ఊళ్లో అందరినీ పలకరించి : కుటుంబ సభ్యులందరూ కలిసి బుధవారం పిండి వంటలు చేశారు. పిల్లలు తాతయ్య వెంట పచ్చని పొలాలు, చెరువు గట్లను చూశారు. పంట కాల్వల్లో కాగితం పడవలు వదిలారు. పూల తోటల్లో తిరిగారు. చెట్ల కింద ఆటలాడారు. ఆరు బయట ఇలాంటివన్నీ చేయడం వారికవన్నీ అదే తొలిసారి. కోడలు ఊళ్లోని బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి వారితో ఆనందంగా కబుర్లు చెప్పి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కుమారుడు అందరితో సంతోషంగా గడుపుతూనే బుక్​ చదువుతున్నారు. చక్కని అనుభూతిని మిగుల్చుకుంటున్నారు.

కోడలు శ్రీలత మాట్లాడుతూ 'నిజమే మామయ్యా ఇప్పటి కాలంలో అయిన వారితో మాటలు, యోగక్షేమాలు ఫోన్లకే పరిమితమవుతున్నారు. వ్యక్తిగతంగా వారిని కలవటం, ఆనందాలను పంచుకోవడం చాలా తగ్గిపోయింది. దసరా పండుగ సెలవు రోజుల్లో గ్రామంలోని అందరినీ కలుస్తా. వారితో ఆనందంగా గడుపుతాను.

బంధాలు నేర్పే బడి వచ్చేసింది - ఇక ఆన్​లైన్​ విధానంలోనూ షురూ - Family and Marriage Counseling

'కాళ్లకు దణ్ణం సరిగా పెట్టు' - బాలయ్యను ఆటపట్టించిన పురందేశ్వరి! - Balakrishna Rakhi celebrations

ABOUT THE AUTHOR

...view details