Tiger Roaming in East Godavari District : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొద్ది రోజులుగా చిరుత పులి సంచారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. చిరుత పులి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రావులపాలెం-కొమరాజులంక సమీపంలో గౌతమి గోదావరిలోని మధ్యలంక ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందన్న వార్త ఆదివారం సాయంత్రం చక్కర్లు కొట్టింది. నారాయణలంకకు చెందిన వెంకన్న, ఊబలంకకు చెందిన గంగరాజు పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
చిక్కదు, దొరకదు - రూటు మార్చి చుక్కలు చూపిస్తున్న చిరుత - Leopard Active in Kadiyam Nurseries
Leopard Wandering :గోదావరిలో వేటకు వెళ్లిన సమయంలో తనకు కనిపించిందని ఒకరు చెప్పగా, తెల్లవారుజామున పడవపై వెళ్తుండగా గోదావరి దుబ్బులు మధ్యలో సడి జరిగిందని మరొకరు చెప్పారు. దీంతో డీఎఫ్‌ఓ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో గౌతమి వంతెన సమీపంలో పరిశీలించారు. 4 బృందాలతో కలిసి ఆ ప్రాంతంలో చిరుత కోసం అన్వేషిస్తున్నారు. వంతెన వద్ద ఉన్న మధ్యలంక ప్రాంతంలో పులి జాడల్ని డ్రోన్ కెమెరా సాయంతో వెతుకుతున్నారు. పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులతో తిరిగి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.