PM Narendra Modi visit Visakhapatnam: బుధవారం విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ కె.విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సారి ప్రధాని విశాఖ వస్తున్నారు. బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న మోదీకి ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా రోడ్ షో: విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన: అదేవిధంగా ప్రధాని పలు ప్రాజెక్టులకు, రైల్వే జోన్ ఏర్పాటుకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్కు డ్రగ్ పార్కును మోదీ వర్చువల్‌గా శంఖుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మోదీ పర్యటన సమయాలు:
- బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాన మంత్రి విశాఖ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు షో నిర్వహిస్తారు.
- అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళశాల మైదానం నుంచి వర్చువల్‌గా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
- ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విశాఖ నుంచి భువనేశ్వర్ బయల్దేరుతారు.
పలు శంఖుస్థాపనలు:
- మోదీ వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
- అలాగే 16వ జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
- వివిధ జాతీయ రహదార్లు, రైల్వే లైన్లను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు: మోదీ పర్యటనకు సంబంధిచిన ఏర్పాట్లను మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తదితరులు పరిశీలించారు. సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ గేటు వరకు రోడ్ షో స్థలాన్ని పరిశీలించారు. సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో తన పర్యటన గురించి ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. విశాఖలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలో పాల్గొననున్నట్లు వివరించారు. అదేవిధంగా హరిత, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రేపు,ఎల్లుండి రెండురోజులు నేను ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాలలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతోపాటు భువనేశ్వర్ లో జరిగే ప్రవాసి భారతీయ దివస్ వేడుకలలో పాల్గొంటాను .https://t.co/nLbE4ZuPE1
— Narendra Modi (@narendramodi) January 7, 2025
రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ద్వారా స్వాగతం పలికారు. రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగు వేస్తుందన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారన్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు విశాఖ వాసులతో కలిసి తానూ నిరీక్షిస్తున్నానని వెల్లడించారు.
రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి రాష్ట్ర ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నాను. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ… https://t.co/eW5slhCGnv
— N Chandrababu Naidu (@ncbn) January 7, 2025
శంకర్ పొలిటికల్ గేమ్ ఛేంజర్ - 'ఎన్నో సీన్లకు కనెక్ట్ అవుతారు'
విద్యార్థులకు గుడ్‌న్యూస్: సంక్రాతి సెలవులు ఎప్పటి నుంచి అంటే!