Attacked for not giving holidays : సెలవులు ఇవ్వలేదనే కారణంతో ఓ ఉద్యోగి తన ఉన్నతాధికారిపై విచక్షణారహితంగా దాడి చేయించాడు. సెలవు కోసం అతడి ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేశాడు. నేరుగా తాను దాడి చేస్తే దొరికిపోతాననే ఆలోచనతో మరో ముగ్గురికి పని అప్పగించాడు. చివరికి నలుగురూ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నారు.
సెలవులు ఇవ్వడం లేదని ఉన్నతాధికారిపై ఓ ఉద్యోగి దాడి చేయించిన ఘటన ఇది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో జరిగిన దాడి కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం డీఎస్పీ ఎం.రాంబాబు మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని గారమ్మకాలనీలో ఉన్న తపాలా కార్యాలయంలో సురేంద్రకుమార్ ఏఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా నవగాం బ్రాంచిలో విధులు నిర్వహిస్తున్న ఏబీపీఎం కె.దుర్గాప్రసాద్ అతడిపై కక్ష పెంచుకున్నాడు. సెలవులు ఇవ్వడం లేదన్న కారణంతో ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. నేరుగా తానే దాడిచేస్తే ఉద్యోగానికి ఆటంకం కలుగుతుందని భావించి మరో ముగ్గురితో స్కెచ్ వేశాడు.
విజయనగరానికి చెందిన షేక్ షాజన్, అంబటి ప్రకాశ్, పుర్రి రాజును సురేంద్రకుమార్‌పై దాడికి పురమాయించాడు. వీరు ముగ్గురూ ఘటనకు ముందు రోజు ఏఎస్పీ కదలికలపై ఆరా తీశారు. ఆయన ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉంటున్నాడో రెక్కీ నిర్వహించారు. గతేడాది అక్టోబరు 8న పథకం ప్రకారం గారమ్మకాలనీలోని ఇంటివద్ద కాపు కాసి సురేంద్రకుమార్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ముఖంపై తీవ్రంగా గాయాలు కాగా అప్పటికే స్థానికులు రావడంతో నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దుర్గాప్రసాద్‌తో పాటు నలుగురినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించామని డీఎస్పీ వెల్లడించారు.
''భార్య-భర్త'' ఓ గోల్మాల్ - పోస్టాఫీసులో బయటపడ్డ ఘరాన మోసం
రూ.755చెల్లిస్తే 15లక్షలు- ఈ జీవిత బీమా పాలసీ అస్సలు వదులుకోవద్దు - Health Insurance