RTC Special Buses For Sankranti: సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులను ఆర్టీసీ నడపనుంది.
బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులను తిప్పనున్నారు. విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణాలకు ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ తెలిపారు. సాధారణ బస్సు ఛార్జీలే ప్రత్యేక బస్సుల్లో ఉంటాయన్నారు.
ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉందని, ఒకేసారి రెండువైపులా టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు
Sankranti Special Trains: మరోవైపు సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ సైతం ఏర్పాటు చేసింది. జనవరి 9వ తేదీన కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్, 10వ తేదీన వికారాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్, 11వ తేదీన శ్రీకాకుళం రోడ్ నుంచి చర్లపల్లి, 12వ తేదీన చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ సర్వీసులు నడపనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీదర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవే కాకుండా ఇప్పటికే రైల్వే శాఖ భారీగా ట్రైన్లను నడుపుతోంది. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీగా స్పెషల్ ట్రైన్లను దక్షిణ మధ్య రైల్వే నడపుతోంది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం జిల్లాలకు పలు ట్రైన్లను కేటాయించారు. ఆయా ప్రాంతాలకు ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం కింద ఉన్న లింక్స్‌పై క్లిక్ చేయండి.
సంక్రాంతికి మరిన్ని రైళ్లు - శ్రీకాకుళంకి స్పెషల్
దక్షిణ మధ్య రైల్వే బంపర్ ఆఫర్ - సంక్రాంతికి మరో 52 ప్రత్యేక రైళ్లు! - బుకింగ్ ఓపెన్