ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూటు​ మార్చిన చిరుత - అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి సంచారం - Leopard at Diwancheruvu Forest

Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం సృష్టించింది. దివాన్​ చెరువు అభయారణ్యంలోనే తిష్ట వేసిన చిరుత ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

LEOPARD AT DIWANCHERUVU FOREST
రూటు​ మార్చిన చిరుత - అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి సంచారం (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 8:18 AM IST

Updated : Sep 25, 2024, 9:15 AM IST

Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari :తూర్పు గోదావరి జిల్లాలో చిరుత మరోసారి కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరంలోని దివాన్​ చెరువు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కడియపులంక దోసాలమ్మ కాలనీలో చిరుత సంచరిస్తున్నట్లు నర్సరీ రైతు మధు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్​ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రలు సేకరించి, వాటి ఆధారంగా చిరుతగా డీఎఫ్​వో భరణి నిర్థారించారు. దీంతో నర్సరీ రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నర్సీరీ కార్మికులకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. చిరుత మాత్రం ఆలమూరు మండలం గోదావరి తీరం వైపు చిరుత వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞుప్తి చేస్తున్నారు.

Last Updated : Sep 25, 2024, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details