ETV Bharat / state

సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ - RAVI SHANKAR MEET CM CHANDRABABU

సీఎం చంద్రబాబును కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ - సాదర స్వాగతం పలికిన సత్కరించిన సీఎం

ravi_shankar_meet_cm_chandrababu
ravi_shankar_meet_cm_chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 10:41 PM IST

Art of Living Founder Ravi Shankar meet CM Chandrababu: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ సీఎం చంద్రబాబుని ఉండవల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రవిశంకర్​కు సాదర స్వాగతం పలికిన సీఎం ఆయనను సత్కరించారు.

భిన్నత్వంలో ఏకత్వమే దేశప్రగతికి మూలం: ముందుగా రవిశంకర్ విజయవాడలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యకమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే దేశప్రగతికి మూలమని అన్నారు. మతం, కులం, జాతి, వర్ణం కంటే మానవత్వం చాలా ముఖ్యమైందని ప్రబోధించారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగడమే నిజమైన లౌకికత్వమని అందరూ మన వాళ్లే అనే భావన ఇక్కడ ఉందని, ఇలాంటి సంస్కృతిని కొనసాగించాలని చెప్పారు.

మన దేశ ఔన్నత్యం చాలా గొప్పదని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. దేశం కోసం, జాతి కోసం అంతా సమైఖ్యంగా జీవనం సాగిద్దామని ఈ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందిద్దామని పిలుపునిచ్చారు. సగటు మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవాలని అన్ని మతాలు ప్రబోధిస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ అన్నారు. ఒత్తిడి నుంచి ప్రశాంత జీవనం సాగించేందుకు శ్రీశ్రీ రవిశంకర్‌ సూచిస్తోన్న సుదర్శన ప్రక్రియ ఎంతో మేలు చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తదితరులు పాల్గొన్నారు.

మహా సత్సంగ్‌ కార్యక్రమం: విజయవాడ బబ్బూరి మైదానంలో మహా సత్సంగ్‌ కార్యక్రమం వేడుకగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ హాజరయ్యారు. గానం-జ్ఞానం-ధ్యానం అంశాలపై రవిశంకర్‌ ప్రసంగించారు. వైభవంగా నిర్వహించిన వేడుకలు పెద్దసంఖ్యలో నగరవాసులు తరలివచ్చారు.

పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం - రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి : లోకేశ్

ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారుకావాలి - సీఎం చంద్రబాబు క్లాస్

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.