తెలంగాణ

telangana

ETV Bharat / state

అచ్చేదిన్‌ కాదు కాంగ్రెస్‌ వచ్చాక సచ్చేదిన్‌ వచ్చింది : కేటీఆర్‌ - KTR Lok Sabha Election campaign - KTR LOK SABHA ELECTION CAMPAIGN

KTR Election Campaign in Hyderabad : కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అచ్చేదిన్‌ కాదు సచ్చేదిన్‌ వచ్చిందని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 16 సీట్లను బీఆర్‌ఎస్‌కే ఇచ్చి గెలిపించారన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ షో పాల్గొన్నారు.

KTR Election Campaign
KTR Election Campaign in Hyderabad (etv bharat)

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 10:11 PM IST

KTR Road Show at Jubliee Hills : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అసెంబ్లీ 24 సీట్లు ఉండే అందులో 16 సీట్లను కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీనే గెలిచిందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ పరిధిలోని ప్రజలు కాంగ్రెస్‌ దొంగ మాటలను నమ్మలేదని తెలిపారు. విశ్వనగరం కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని నమ్మారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని పద్మారావుగౌడ్‌ను గెలిపించాలని కోరారు. అయితే నమాజ్‌ సందర్భంగా కాసేపు కేటీఆర్‌ను స్పీచ్‌ను ఆపేశారు. మళ్లీ ప్రసంగం ప్రారంభిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

హైదరాబాద్‌లో కులం, మతం ఏదైనా కలిసే ఉంటామని, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి పొట్టకూటి కోసం వస్తుంటారని కేటీఆర్‌ తెలిపారు. 2014లో బడా భాయ్‌ మోదీ బడా మోసం చేశారని గుర్తు చేశారు. ఖాతాలు తెరవండి రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తామని అన్నారని నాడు మోదీ చెప్పిన విషయాలను జ్ఞాపకం చేశారు. అలాగే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారన్నారు. ఇప్పుడు 2023లో రేవంత్‌ రెడ్డి అదే విధంగా చోటా భాయ్‌ అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తానని, ముసలివాళ్లకు రూ.4 వేలు పింఛన్‌ ఇస్తామన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ వచ్చాక అచ్చేదిన్‌ కాదు సచ్చేదిన్ : కానీ కాంగ్రెస్‌ వచ్చాక అచ్చేదిన్‌ కాదు సచ్చేదిన్‌ వచ్చిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ వస్తే కరెంటు కష్టాలు, నీటి కష్టాలు వచ్చి, పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 10నుంచి 12 సీట్లను బీఆర్‌ఎస్‌కు అప్పజెప్పండి, కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని జోస్యం చెప్పారు. సంవత్సరంలో కేసీఆర్‌ సేవలు అందించే స్థాయిలో ఉంటారన్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్‌ కండువా కప్పుకొని ఎన్నికలకు వచ్చారని విమర్శించారు. ఆయన రేపు గెలిస్తే బీజేపీలో చేరతారని, చేరరని ఏమైనా గ్యారంటీ ఉందా అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్‌ రెడ్డి, దానం నాగేందర్‌ ఇద్దరూ బీజేపీలో చేరతారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి ఐదేళ్లో ఏం చేయలేదని, అక్కరకు రాని వ్యక్తి పదవిలో ఉన్నా ఏం లాభం లేదని దుయ్యబట్టారు.

బీజేపీకి వేసే ప్రతి ఓటు - రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది : రేవంత్ రెడ్డి - lok sabha elections 2024

ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి : సీఎం రేవంత్ - CM Revanth Road Show at Siddipet

ABOUT THE AUTHOR

...view details