KTR Latest Tweet : వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని సర్కార్ వంచనతో మళ్లీ ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు పరిహారమా? పరిహాసమా? అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దానికి వివిధ వార్తా పత్రికల కథనాలను జోడించారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. నాలుగు లక్షల 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
నివేదిక నిజం కాదా?: పంట నష్టం అంచనాలను తలకిందులుగా ఎందుకు మార్చేశారని, ఏకంగా 3 లక్షల 35 వేల ఎకరాలు ఎలా ఎగిరిపోయాయని విమర్శించారు. 79 వేల 574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణమని కేటీఆర్ ఆరోపించారు. అపార నష్టంతో అల్లాడుతున్న రైతులను ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా, మానవత్వం ప్రదర్శించలేరా అని ప్రశ్నించారు. ఐదు లక్షల 20 వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదిక ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు ఇంత భారీ కోతలా అని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR