KRMB Meeting With Telangana AP ENCs Today :శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఔట్ లెట్ల నిర్వహణను ఇక నుంచి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేపట్టనుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ(Central Water Resources Department) కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొనసాగింపుగా, కేఆర్ఎంబీ ఛైర్మన్ శివనందన్ కుమార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో సమావేశమయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చేరిన కాగ్ రిపోర్డ్
Nagarjuna Sagar Handed Over to KRMB :సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రాధాన్య ఔట్‌లెట్లను బోర్డుకు స్వాధీనం చేసేందుకు ఆపరేషన్ ప్రొటోకాల్స్ ఖరారు, కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాల విషయంలో తమ వాదనను తెలంగాణ ప్రభుత్వం మరోమారు వినిపించింది. ట్రైబ్యునల్ ద్వారా తుది కేటాయింపులు జరగాలని, అప్పటి వరకు 811 టీఎంసీల్లో చెరి సగం వాటా కావాలని, శ్రీశైలంలో నీటి మట్టం, తాగునీటి వినియోగం తదితరాలను ఈఎన్సీ మురళీధర్ వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జలవిద్యుత్ కేంద్రాలు మినహా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన ఔట్ లెట్ల నిర్వహణను బోర్డుకు అప్పగించేందుకు సమావేశం నిర్ణయం తీసుకొంది. ఔట్ లెట్ల నుంచి నీటి విడుదల త్రిసభ్య కమిటీ నిర్ణయాల మేరకే జరగాలని నిర్ణయించారు. నీటి విడుదల నిర్ణయాల అమలుకు రెండు రాష్ట్రాల నుంచి సిబ్బందిని కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు. మరమ్మత్తుల విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న విధానమే అమలు కానుంది.
Srisailam Handed Over to KRMB :నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరమ్మత్తులను తెలంగాణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మత్తులను ఏపీ చేపట్టనుంది. రాష్ట్రానికి సంబంధించిన వాదనలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, జలవిద్యుత్ కేంద్రాల విషయమై ఎలాంటి ప్రస్తావన లేదని అన్నారు. సాగర్ ఎడమ కాల్వ నుంచి ఫిబ్రవరిలో రెండు టీఎంసీలు, కుడి కాల్వ నుంచి మార్చిలో మూడు టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించినట్లు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు.
ఏంటీ! కాళేశ్వరం బ్యారేజీల్లో లోపాలను మూడేళ్ల క్రితమే గుర్తించారా! ముందే హెచ్చరించినా పట్టించుకోలేదా!