KRMB Latter To Telugu States :రెండో దశలో ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల కోసం నిధులు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని 9 చోట్ల సైడ్ లుకింగ్ కలర్ డాప్లర్ ప్రొఫైలర్స్తో కూడిన టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని బోర్డు 9, 12వ సమావేశాల్లో నిర్ణయించారు. వీటికి రూ.6.25 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నిధులు ఇవ్వకపోవడంతో 2023-24లో వీటిని ఏర్పాటు చేయలేకపోయినట్లు కేఆర్ఎంబీ తెలిపింది.
టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వండి - తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ - KRMB latter To Both Telugu States - KRMB LATTER TO BOTH TELUGU STATES
KRMB Latter To Telugu States : టెలిమేట్రీ స్టేషన్ల ఏర్పాటు కోసం నిధులు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. వాటి నిర్మాణానికి రూ.6.25 కోట్లు అవసరమవుతాయని తెలిపింది. గతేడాది నిధులు ఇవ్వకపోవడంతో 2023-24లో వీటిని ఏర్పాటు చేయలేకపోయినట్లు వెల్లడించింది.
Published : Apr 6, 2024, 9:55 AM IST
రెండు రాష్ట్రాల నీటి వినియోగంలో పారదర్శకత, వాటాలు సరిగ్గా పొందాలంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అత్యవసరమని బోర్డు పేర్కొంది. ఈ అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. అటు నాగార్జున సాగర్ డ్యాంపై మరమ్మతుల పనులు చేసేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చింది. రేడియల్ క్రస్ట్ గేట్లకు సంబంధించిన విద్యుత్ కంట్రోల్ ప్యానెళ్లు, కేబుల్స్ పనులను వర్షాకాలంలోపు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఆ మరమ్మత్తుల పనుల పూర్తి కోసం తెలంగాణ అధికారులను అనుమతించాలని అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న సీఆర్పీఎఫ్ అధికారులను బోర్డు ఆదేశించింది.
GRMB Meeting: తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు
దిల్లీలో ఫిబ్రవరి 1న కేఆర్ఎంబీ సమావేశం - ప్రోటోకాల్ ప్రణాళికపై చర్చ