తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫెయింజల్​ తుపాన్ ఎఫెక్ట్​ - 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం - CYCLONE FENGAL WARNING

ఫెయింజల్​ తుపాను ప్రభావంతో 20 మీటర్లు ముందుకు వచ్చిన ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం బీచ్​లోని సముద్రం

Cyclone Fengal Effect
Cyclone Fengal Effect (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 2:22 PM IST

Cyclone Fengal Effect : ఫెయింజల్​ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. తుపాను నేపథ్యంలో సముద్రం 20 మీటర్లకు పైగా ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మెరైన్​ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కార్తిక మాసం పుణ్యస్నానాల కోసం భక్తులు ఎవరూ సముద్రంలోకి స్నాం చేయడానికి అనుమతి లేదని చెప్పారు.

విశాఖకు విమాన సర్వీసులు రద్దు :ఫెయింజల్​ తుపాను కారణంగా విశాఖ నుంచి పలు విమానాల సర్వీసులు రద్దు అయ్యాయి. తిరుపతిలో భారీ వర్షానికి విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. తుపను ప్రభావంతో భారీ వర్షాలకు తిరుమలలో ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. పాపవినాశనం, ఆకాశగంగ, పసుపుధార, కుమారధార జలాశయాల్లో పూర్తిస్థాయి నీటిమట్టం సాగుతోంది. అలాగే గోగర్భం జలాశయం రెండు గేట్లును ఎత్తి నీరు బయటకు విడుదల చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయిపోయాయి.

తుపాను ప్రభావం తెలంగాణలో :తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద కూడా పడింది. ఆకాశం మేఘామృతం కావడం, గాలిలో తేమ శాతం పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. డిసెంబరు 5 వరకు చలి ప్రభావం ఇలానే ఉంటుంది హైదరాబాద్​ వాతావరణ విభాగం తెలిపింది. తుపాను కారణంగా ఆది, సోమ వారాల్లో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు శుక్రవారం రాత్రి ఆదిలాబాద్​ జిల్లా బంరపూర్​లో అత్యల్పంగా 14.6, జైనథ్​ మండలం భోరజ్​లో 14.7, రాంనగర్​లో 14.9 డిగ్రీల సెల్సియస్​ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

తీరం దాటిన ఫెయింజల్​ తుపాను : తుపాను శనివారం సాయంత్రం తమిళనాడు వద్ద తీరాన్ని దాటింది. ఇది పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం-కరైకల్​ మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతి కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు.

ఫెయింజల్ తుపాను బీభత్సం - చెన్నై అతలాకుతలం

'ఫెయింజల్‌' ఎఫెక్ట్ : ఆ జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్స్‌' హెచ్చరిక - అప్పటి వరకు నో చేపల వేట

ABOUT THE AUTHOR

...view details