Kodi Katthi Srinu Bail: అధికార పీఠం దక్కించుకునే కుట్రపూరిత ప్రణాళికలో సామాన్యుడే సమిధ అనే విషయం చరిత్ర చెప్తోంది. అదే విషయాన్ని వర్తమానంలోనూ పలు సందర్భాలు రుజువు చేస్తున్నాయి. తమ నాయకుడు సీఎం కావాలన్న వెర్రి అభిమానం, తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచినట్లు కథ అడ్డం తిరిగింది. ఐదేళ్లు ఊచల వెనక్కి నెట్టింది. ఇంటికి దూరమై, నా అనే వాళ్లకు కొండంత దుఃఖాన్ని మిగిల్చింది.
కోడికత్తి కేసుగా పేరొందిన ఈ రాజకీయ చదరంగంలో బలమైన ప్రత్యర్థులకు చెక్‌పెట్టే క్రమంలో పావుగా మారిన దళిత బిడ్డ జనుపల్లి శ్రీనివాసరావు కథ తుది అంకానికి చేరింది. ఎట్టకేలకు పోరాటం ఫలించింది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. వృద్ధులైన తల్లిదండ్రులు, తన సోదరుడి ఎదురుచూపులు ఫలించాయి. ఓ వైపు న్యాయవాదుల పోరాటం, ప్రజా సంఘాల సహకారం వెరసి న్యాయదేవత దిగివచ్చింది. శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది.
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా - సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది
kodikatti case accused srinivas granted bail by high court: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విడుదలయ్యాక కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని ఈ సందర్భంగా శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశించింది. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేయగా.. నాటి నుంచి జైలులోనే మగ్గుతున్నాడు. ఇన్నాళ్లూ కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్న శ్రీనివాస్‌కు ఇవాళ బెయిల్ మంజూరైంది. బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు రూ.25 వేలు పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. మీడియాతో మాట్లాడొద్దని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించింది.