Kishan Reddy Road Show In sanathnagar : నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. విజయ సంకల్ప యాత్రలో(Vijaya Sankalpa Yatra) భాగంగా సనత్నగర్ నియోజకవర్గంలోని పద్మారావు నగర్ బైబిల్ హౌస్, మహంకాళి స్ట్రీట్, మోండా మార్కెట్, బేగంపేట్ ప్రాంతాల మీదుగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో బీజేపీ(BJP) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో నీతివంతంగా, అవినీతి రహితంగా పరిపాలిస్తూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప నాయకుడిగా మోదీ నిలిచారని అన్నారు.
ఇటీవలే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని స్వయంగా వచ్చి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు లేవని, కర్ఫ్యూలు లేవని చెప్పారు. గతంలో వేలాది మంది బలిదానాలు జరిగినా, అయోధ్యలో మందిరం నిర్మాణం జరగలేదని ప్రధాని మోదీ(PM Modi) పాలనలో అయోధ్య నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మోదీ సర్కార్ 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చిందని, ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయని వివరించారు.
6 గ్యారంటీలు అమలు చేయమంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటి? : కిషన్‌రెడ్డి
Kishan Reddy Comments on BRS Congress Party : దేశంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను మోదీ పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని పెంచుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయడం వల్ల ఒరిగేదేమీ లేదని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి కోల్పోయిందని ఆయన ఆరోపించారు. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, విమానాశ్రయాల పెంపు, పేద ప్రజలందరికీ నాణ్యమైన బియ్యం పంపిణీ, దేశ ప్రజలకు కరోనా విపత్కర సమయంలో వ్యాక్సిన్ పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ పాలనలో అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు లేవు. కర్ఫ్యూలు లేవు. గతంలో వేలాది మంది బలిదానాలు జరిగినా, అయోధ్యలో మందిరం నిర్మాణం జరగలేదు.ప్రధాని మోదీ పాలనలో అయోధ్య నిర్మాణం జరిగింది. మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాం. 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం. ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతాం. దేశంలో మోదీ అవలంభిస్తున్న అభివృద్ధి పథకాలే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం. - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
'ప్రపంచ దేశాలన్నీ మోదీ వైపు చూస్తున్నాయి - రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతాం' 17 పార్లమెంట్ నియోజకవర్గాలు - 5,500 కిలోమీటర్లు - 12 రోజులు - బీజేపీ రథయాత్ర నేడే ప్రారంభం
'కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి బొమ్మాబొరుసు లాంటివి - రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయింది'