Kishan Reddy Participate in BJP Vijaya Sankalpa Yatra :తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra) తూఫ్రాన్ నుంచి గజ్వేల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రూ.12 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఉన్న కేంద్ర నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు సైతం జైలుకి వెళ్లి వచ్చి బెయిల్‌పై తిరుగుతున్నారని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నిక(Lok Sabha Election)ల్లో కమలం పువ్వుపై ఓటు వేసి మోదీని మూడోసారి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే వృథా అవుతుందనీ పేర్కొన్నారు. 500 ఏళ్ల నుంచి ఏ పార్టీ చేయలేని ఘనమైన అయోధ్య రామ మందిరం నిర్మాణం మోదీ చేసి భారత జాతికి అండగా నిలిచారు అన్నారని హర్షం వ్యక్తం చేశారు.
విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్
BJP Leader Raghunandan Rao Fire on BRS : బీజేపీని బద్నం చేయడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం క్లియర్‌గా చెప్పిందని పేర్కొన్నారు. గజ్వేల్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీ 10 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 7 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ను బీజేపీ(BJP)నే ఎదుర్కొంటుందని మూడుసార్లు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని పేర్కొన్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నారు, కేజ్రీవాల్ హైదరాబాద్ వస్తే కేసీఆర్ ఇంటికి వెళతారని వీళ్లిద్దరూ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. దిల్లీలో లిక్కర్ దుకాణం పెట్టి కొత్త దందా మొదలు పెట్టారని దిల్లీ డిప్యూటీ సీఎం జైల్లోనే ఉన్నారని ధ్వజమెత్తారు. అలాగే ఇక్కడ ఉన్న తెలంగాణ చెల్లె బతుకమ్మ పైసలు సరిపోతలేవని కొత్త దందాను మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బొమ్మ బొరుసు లాంటివి బీజేపీ కార్యకర్తలు ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మకండని రఘునందనరావు హితవు పలికారు.
బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక పొత్తుల దుష్ప్రచారం చేస్తున్నారు : రఘునందన్ రావు
బీజేపీ నయా స్కెచ్- నోటిఫికేషన్‌కు ముందే 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా- మోదీ, షా సైతం!