తెలంగాణ

telangana

ETV Bharat / state

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై సుప్రీంకోర్టుకు కేసీఆర్‌ - నేడే విచారణ - KCR Petition in SC - KCR PETITION IN SC

BRS Chief KCR Petition in the Supreme Court : జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఇచ్చిన సమన్లపై మాజీ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టును కేసీఆర్‌ ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.

BRS Chief KCR Petition in the Supreme Court
BRS Chief KCR Petition in the Supreme Court (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 10:37 PM IST

Updated : Jul 15, 2024, 6:20 AM IST

Ex CM KCR Petition in Supreme Court Against Justice Narasimha Reddy Commission : రాష్ట్రంలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్​గఢ్​ నుంచి జరిగిన విద్యుత్​ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్​ ఎల్​.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్​ ఏర్పాటు చేయడాన్ని సవాల్​ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై జూన్​ 24న కేసీఆర్​ దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ విద్యుత్​ సంస్థలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్​ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపి, ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్​ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్​ కమిషన్​ ఆఫ్​ ఎంక్వయిరీ యాక్ట్​ 1952, విద్యుత్తు చట్టం-2003కి విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కేసీఆర్​ ఈ పిటిషన్​ను దాఖలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్​కు లేదని ఆయన తన పిటిషన్​లో పేర్కొన్నారు.

Last Updated : Jul 15, 2024, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details