Jharkhand MLAs Camp in Hyderabad :హైదరాబాద్‌లోని శామీర్‌పేట లియోనియా రీసార్ట్స్ శిబిరంలో ఉన్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇవాళ రాంచీకి వెళ్లనున్నారు. రేపు ఝార్ఖండ్ శాసన సభలో స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేలు హాజరై, బల నిరూపణ చేయాల్సి ఉంది. దీంతో ఇవాళ మధ్యాహ్నం భోజనం తర్వాత ఝార్ఖండ్‌కు వెళతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ చేయాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
Jharkhand MLAs going to Ranchi Today :కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలు మూడు రోజులుగా హైదరాబాద్ శిబిరంలో ఉన్నారు. వారు ఉంటున్న రీసార్ట్స్ వద్ద ఎవరినీ లోనికి వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే రిసార్ట్స్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, మల్‌రెడ్డి రామిరెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.
కంచుకోటను మరోసారి కైవసం చేసుకునేందుకు 'హస్తం' పక్కా ప్లాన్ - నిజామాబాద్ బరిలో ఆ అభ్యర్థి!
Jharkhand MLAs Camp in Hyderabad :ఝార్ఖండ్ (Jharkhand) నూతన సీఎంగా చంపయీ సోరెన్ (Champai Soren) ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ బలపరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం (JMM) చర్యలు చేపట్టింది. 81 మంది సభ్యుల ఝార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
ఝార్ఖండ్ శాసన సభలో 81 మంది ఎమ్మెల్యేలకు గానూ 41 మంది మెజార్టీ ఉంటే వారిదే అధికారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎం మూడింటికి కూడా తగినంత మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న జేఎంఎం పార్టీతో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.