Jawahar Navodaya 9th Class Notification 2024-25 : దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ (లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 9 తగగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తారు. బాల బాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. దీనికి అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.
జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష :9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివి ఉండాలి. 01.05.2010 నుంచి 31.07.2012 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశ పరీక్ష : జవహర్ నవోదయ ప్రవేశానికి పెట్టే రాత పరీక్షలో విద్యార్థులకు వచ్చే మార్కులు ఆధారంగా ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. హిందీ (15 ప్రశ్నలు- 15 మార్కులు), సైన్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), మ్యాథమెటిక్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), ఇంగ్లిష్ (15 ప్రశ్నలు- 15 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు. 2.30 గంటలు ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్ హిందీ, ఇంగ్లిష్ భాషలో ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు అభ్యర్థి వివరాలను పేర్కొనాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఈరోజే ఆఖరి రోజు కావడంతో వెంటనే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష తేదీ 08-02-2025నాడు ఉంటుంది.
ఈ లైబ్రరీల్లో 'చదువు' ఒక్కటే కాదు - అంతకు మించి ఎన్నో సేవలు - Free Library in Hanamkonda
జాబ్ కొట్టాలంటే మార్కులే ఉండాలా ఏంటి? - HR నిపుణులు ఏం చెబుతున్నారంటే? - Job Getting Skills