Pawan Kalyan visited Sri Nukambika temple: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. మెుదట ప్రత్యేక విమానంలో విశాఖ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్నే నేరుగా అనకాపల్లిలోని నూకలమ్మను దర్శించుకున్నారు. పవన్‌తో పాటుగా ఎంపీ సిఎం రమేష్ సైతం నూకాంబికా ను దర్శించుకున్నారు.
దిల్లీ నుంచి విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్- నూకాంబికా అమ్మవారి సేవలో జనసేనాని - Pawan Kalyan visited Sri Nukambika temple - PAWAN KALYAN VISITED SRI NUKAMBIKA TEMPLE
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని ఎన్నికల ప్రచారంలో మొక్కుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం వరించటంతో, నేడు ఆలయానికి వచ్చి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 3:42 PM IST
భారీ మెజార్టీతో గెలుపొందిన పవన్ కల్యాణ్: పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి విజయం సాధించారు. మరోవైపు, 21 స్థానాల్లో పోటీచేసిన జనసేన దాదాపు అన్ని సీట్లనూ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో తాను ముందుగా అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ నేడు నూకాంబికాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.