ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కార్యాలయంలో సోదాలు - భారీగా డబ్బు ఉందన్న సమాచారం - Searches in Shirdi Sai Electricals - SEARCHES IN SHIRDI SAI ELECTRICALS

Searches in Shirdi Sai Electricals Office: కడపలోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో సోదాలు కలకలం రేపాయి. భారీగా డబ్బు ఉందన్న సమాచారంతో ఎన్నికల పరిశీలకులతోపాటు ఐటీ, పోలీసు అధికారులు సోదాలు చేస్తున్నారు.

Searches in Shirdi Sai Electricals Office
Searches in Shirdi Sai Electricals Office (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 12:29 PM IST

Updated : May 11, 2024, 2:07 PM IST

Searches in Shirdi Sai Electricals Office: కడప శివారులోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారులు సోదాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి షిర్డీ సాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో ఉదయం నుంచి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

జిల్లాకు వచ్చినటువంటి ముగ్గురు ఎన్నికల పరిశీలకులు, ఐటీ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం కార్యాలయంలో రెండు గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బు ఈ కార్యాలయంలో ఉంటుందనే సమాచారంతో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఓటర్లకు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ద్వారా డబ్బులు పంపిణీ చేసేందుకు ఈ కార్యాలయంలోని పెద్ద మొత్తంలో డబ్బు దాచిపెట్టి ఉంటారని సమాచారంతో ఎన్నికల అధికారులు దాడులు చేశారు. అయితే ఎంత స్వాధీనం చేసుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదాయపన్ను అభియోగాలు - షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో ఐటీ సోదాలు

Last Updated : May 11, 2024, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details