Tatkal Scheme for Intermediate Students: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించామని అన్నారు. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లోకేశ్ కోరారు.
ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టాము. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాం. వివిధ కారణాలవల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని… pic.twitter.com/CzNxVl9NVO
— Lokesh Nara (@naralokesh) December 23, 2024
Intermediate Exam Schedule: మరోవైపు ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు :
- మార్చి 1 - సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 4 - ఇంగ్లీష్
- మార్చి 6 - మేథమెటిక్స్ పేపర్ 1ఏ, బోటనీ, సివిక్స్
- మార్చి 8 - మేథమెటిక్స్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ
- మార్చి 11 - ఫిజిక్స్, ఎకనామిక్స్
- మార్చి 13 - కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
- మార్చి 17 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్
- మార్చి 19 - మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ
Dear Students,
— Lokesh Nara (@naralokesh) December 11, 2024
Intermediate Exam Schedule is released!! 📚 It's time to focus and properly plan your preparation. Stay stress-free, take care of your health, and give your best effort. Wishing you all the success! 💪 #IntermediateExams #StayPositive pic.twitter.com/czsJMCmCtU
మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలు :
- మార్చి 3 - సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 5 - ఇంగ్లీష్
- మార్చి 7 - మేథమేటిక్స్ పేపర్ -2ఏ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2
- మార్చి10 - మేథమేటిక్స్ పేపర్ -2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
- మార్చి 12 - ఫిజిక్స్, ఎకానమిక్స్
- మార్చి15 - కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
- మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మేథమెటిక్స్ పేపర్ -2
- మార్చి 20 - మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2
మార్చి 1 నుంచి ఇంటర్ - 17 నుంచి పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్ విడుదల
పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - మీకు నచ్చిన మీడియం ఎంచుకోవచ్చు